close

తాజా వార్తలు

ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీకి మారినప్పుడు పీఎఫ్‌ ఖాతాలో డబ్బులు బదిలీ చేయడానికి/ విత్‌డ్రా చేసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కారణం.. మీరు గతంలో పనిచేసిన సంస్థ.. మీరు ఉద్యోగం నుంచి వైదొలగిన తేదీని ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌లో నమోదు చేయకపోవడమే ఇందుకు కారణం. కేవలం సదరు కంపెనీలకే ఇప్పటి వరకు ఆ అవకాశం ఉండడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడేవారు. ఒక్కోసారి నెలల తరబడి నగదు బదిలీ చేసుకోవడానికి/ విత్‌డ్రా చేసుకోవడానికి తంటాలు పడేవారు. అలాంటి వారి కోసం ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇకపై ఉద్యోగులే ఆన్‌లైన్‌లో ఉద్యోగం వైదొలిగిన తేదీని నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది.

నమోదు ఇలా..
ఈపీఎఫ్‌ఓ ఈసేవా పోర్టల్‌లో ఈ వివరాలను మార్చుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఉద్యోగులు తమ యూఏఎన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. ‘మేనేజ్‌’ టాబ్‌లోకి వెళ్లి ‘మార్క్‌ ఎగ్జిట్‌’లోకి వెళ్లాలి. మీరు గతంలో పనిచేసిన సంస్థ నుంచి ఉద్యోగంలోంచి వైదొలిగిన తేదీ, కారణాన్ని అక్కడ తెలపాలి. ఆ తర్వాత ఓటీపీ కోసం రిక్వెస్ట్‌ పెట్టి.. అనంతరం ఓటీపీని ఎంటర్‌ చేయాలి. చివర్లో అప్‌డేట్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ఈపీఎఫ్‌ఓ రికార్డుల్లో మీరు వైదొలిగిన తేదీని నమోదు చేయొచ్చు. అయితే, ఈ ప్రక్రియ పూర్తి చేసే ముందు అంతకుముందు మీరు పనిచేసిన కంపెనీ సదరు వివరాలు నమోదు చేసిందీ లేనిదీ ఓ సారి తనిఖీ చేసుకోవడం ఉత్తమం. అయితే, ఈ తేదీ నమోదు చేయాలంటే మీరు ఉద్యోగం నుంచి వైదొలిగి కనీసం రెండు నెలలు అయ్యి ఉండాలి. పాత కంపెనీ మీ పీఎఫ్‌ ఖాతాలో చివరిసారిగా జమ చేసి రెండు నెలల దాటిన తర్వాతే ఈ మార్పులు చేసేందుకు వీలుంటుంది.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.