close

తాజా వార్తలు

Updated : 27/10/2020 13:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘రెట్రో’ కేసు తీర్పుపై భారత్‌ సవాల్‌!

దిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్‌ చెల్లించాల్సిన రూ.20 వేల కోట్ల రెట్రోస్పెక్టేటీవ్‌ పన్ను కేసులో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (ఆర్బిట్రేషన్‌) తీర్పును భారత్‌ సవాల్‌ చేయనుంది. ఈ మేరకు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను న్యాయ సలహా కోరినట్లు తెలుస్తోంది. స్థానిక పార్లమెంట్‌ రూపొందించిన చట్టాలను దాటి మధ్యవర్తిత్వ న్యాయస్థానం తీర్పు ఇవ్వకూడదని తుషార్‌ మెహతా అన్నారు. ది హేగ్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తి్త్వ న్యాయస్థానం రెట్రోస్పెక్టేటివ్‌ కేసులో గత నెలలో వొడాఫోన్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఆదాయపన్ను శాఖ పారదర్శకంగా, సమానంగా చూడటంలో విఫలమైందంటూ.. వొడాఫోన్‌పై భారత ప్రభుత్వం పన్ను విధించడం అహేతుకం అని పేర్కొంది. ఇది భారత్‌-నెదర్లాండ్స్‌ మధ్య పెట్టుబడుల ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని వాదించింది. వొడాఫోన్‌ నుంచి బాకీల వసూలను తక్షణమే నిలిపి వేయాలని, అంతేకాకుండా కోర్టు ఖర్చుల కింద రూ.40 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.

భారత్‌లో టెలికాం సేవలు అందిస్తున్న హచిసన్‌ ఈక్విటీలో 67 శాతం వాటాను వొడాఫోన్‌ 2007లో 1,100 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. దీనికి టీడీఎస్‌ కింద రూ.11,000 కోట్లు చెల్లించాలని ఆదాయ పన్ను  శాఖ నోటీసులు జారీ చేసింది. వొడాఫోన్‌ ఈ మొత్తం చెల్లించక పోవడంతో జరిమానా, వడ్డీలతో ఈ మొత్తాన్ని రూ.19,900 కోట్లకు పెంచారు. 2012 జనవరిలో ఐటీ శాఖ డిమాండ్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం  పాత తేదీలతో వర్తించేలా చట్టాన్ని సవరించి మళ్లీ వొడాఫోన్‌ గ్రూప్‌నకు పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. దాంతో వొడాఫోన్‌ 2014లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని అశ్రయించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.