close

Updated : 27/02/2021 11:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వివాద్‌ సే విశ్వాస్‌..గడువు పొడిగింపు

దిల్లీ: ప్రత్యక్ష పన్ను వివాదాల్ని పరిష్కరించడానికి వీలుగా తీసుకొచ్చిన ‘వివాద్‌ సే విశ్వాస్‌’ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన గడువును కేంద్రం పొడిగించింది. ఫిబ్రవరి 28 వరకు ఉన్న ఈ గడువును మార్చి 31 వరకు పొడిగించారు. అలాగే ఈ వివాద పరిష్కార పథకం కింద చెల్లింపులు చేసే తేదీని సైతం 30 ఏప్రిల్‌కు మార్చారు. ఈ మేరకు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీడీటీ) శుక్రవారం ప్రకటన చేసింది.

వివిధ అప్పిలేట్‌ ఫోరమ్‌ల వద్ద ప్రస్తుతం 5,10,491 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 24.5 శాతం అంటే 1,25,144 కేసుల్లో వివాద్‌ సే విశ్వాస్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో దాదాపు రూ.97 వేల కోట్లు విలువ చేసే వివాదాలకు ఈ పథకం కింద పరిష్కారం లభించనుంది. వివిధ అప్పిలేట్‌ ఫోరమ్‌లలో ఉన్న ప్రత్యక్ష పన్ను వివాదాల్ని పరిష్కరించడానికి వీలుగా ‘వివాద్‌ సే విశ్వాస్‌’ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన సంగతి తెలిసిందే. నోటీసు జారీ అయ్యి.. ఇంకా విచారణ ప్రారంభం కాని సంస్థలు సైతం ‘వివాద్‌ సే విశ్వాస్‌’ పథకం వినియోగించుకోవచ్చని ఆదాయపు పన్ను శాఖ ఇటీవల స్పష్టం చేసింది.

ఇవీ చదవండి...

కొత్త నిబంధనల ప్రకారం అధిక టీడీఎస్ వ‌ర్తిస్తుందా?

ఈఎల్ఎస్ఎస్‌తో ప‌న్ను ఆదాతో పాటు సంపద సృష్టి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని