Retrospective tax: కేంద్రం కీలక నిర్ణయం.. రెట్రోస్పెక్టివ్‌ పన్ను విధానానికి స్వస్తి! - Govt to amend Income Tax Act to nullify retrospective tax demands
close

Published : 05/08/2021 19:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Retrospective tax: కేంద్రం కీలక నిర్ణయం.. రెట్రోస్పెక్టివ్‌ పన్ను విధానానికి స్వస్తి!

దిల్లీ: వివాదాస్పదంగా మారిన రెట్రోస్పెక్టివ్‌ పన్ను (వెనుకటి తేదీల నుంచి వేసే పన్ను) విధానానికి స్వస్తి చెప్పేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టాన్ని సవరించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం కీలక బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ నిర్ణయం వల్ల వొడాఫోన్‌, కెయిర్న్‌ ఎనర్జీ సహా 15 వరకు సంస్థలు లబ్ధి పొందనున్నాయి.

ఈ బిల్లు ప్రకారం.. 2012 మే 28 కంటే ముందు జరిగిన పరోక్ష ఆస్తుల బదిలీలపై ఎలాంటి పన్నులు వసూలు చేయబోమని కేంద్రం పేర్కొంది. బిల్లులో భాగంగా రెట్రోస్పెక్టివ్‌ పన్ను విధానం కింద వసూలు చేసిన మొత్తాన్ని వడ్డీ లేకుండా రీఫండ్‌ చేయనుంది. ఏళ్లుగా దేశంలో వ్యాపార అనుకూల వాతావరణం నెలకొందని, ఈ రెట్రోస్పెక్టివ్‌ పన్ను విధానం వల్ల పెట్టుబడిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దీని రద్దుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వొడాఫోన్‌, కెయిర్న్‌ ఎనర్జీ విషయాల్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌లో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ పన్ను విధానాన్ని తీసుకొచ్చింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని