బ్యాంకుల ప్రైవేటీకరణకు RBIతో కలిసిపనిచేస్తాం - Govt to work with RBI for execution of bank privatisation plan: Sitharaman
close

Updated : 07/02/2021 18:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాంకుల ప్రైవేటీకరణకు RBIతో కలిసిపనిచేస్తాం

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి

ముంబయి: బడ్జెట్‌లో ప్రతిపాదించిన బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రణాళికను అమలు పరిచేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)తో కలిసి పనిచేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ప్రైవేటీకరణకు సంబంధించిన వివరాలు సిద్ధమవుతున్నాయని, త్వరలోనే ప్రకటన చేస్తామని తెలిపారు. ఈ మేరకు ముంబయిలో ఆమె మీడియాతో మాట్లాడారు. రెండు బ్యాంకులను ప్రైవేటీకరిస్తామని ఇదివరకే ఆమె బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, బ్యాంకులను అప్పగించే వ్యక్తుల వివరాలు తెలియజేసేందుకు ఆమె నిరాకరించారు.

నేషనల్‌ అస్సెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఏఆర్‌సీ) పేరిట ఏర్పాటు కాబోయే బ్యాండ్‌ బ్యాంక్‌పైనా నిర్మలా సీతారామన్‌ మాట్లాడారు. బ్యాంకుల నిరర్ధక ఆస్తుల బదిలీకి ఏర్పాటు చేయబోయే నేషనల్‌ ఏఆర్‌సీకి ప్రభుత్వం తరఫున కొంతమేర హామీ ఉంటుందని చెప్పారు. బ్యాంకుల పనితీరు మెరుగుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అలాగే అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రా సెస్‌ ద్వారా కేంద్రానికి రూ.30వేల కోట్లు సమకూరే అవకాశం ఉందని చెప్పారు. దేశంలో పెట్రోల్‌ ధరలు భగ్గుమంటున్న వేళ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తే.. ఆ మేరకు రాష్ట్రాలు పన్నులు పెంచుకుని, ఆదాయాన్ని సంపాదించుకుంటాయని చెప్పారు. కేంద్రం తగ్గించడం వల్ల రేట్లలో పెద్దగా మార్పు ఉండబోదని వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి..
జాగ్ర‌త్త‌గా ఉప‌యోగిస్తే.. ప్ర‌యోజ‌నాలే ఎక్కువ‌
గృహ‌రుణాల‌పై వ‌ర్తించే ఛార్జీలేంటో తెలుసా?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని