హెచ్‌సీఎల్‌ టెక్‌ ఉద్యోగులకు శుభవార్త! - HCL Tech announces special one-time bonus for employees
close

Published : 08/02/2021 13:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హెచ్‌సీఎల్‌ టెక్‌ ఉద్యోగులకు శుభవార్త!

బెంగళూరు: దేశీయ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఉద్యోగులకు సంస్థ శుభవార్త తెలియజేసింది. 2020లో కంపెనీ ఆదాయం 10 బిలియన్‌ డాలర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులందరికీ ప్రత్యేక బోనస్‌ ప్రకటించింది. కంపెనీలో కనీసం ఒక ఏడాది అనుభవం ఉన్న ఉద్యోగులకు పది రోజుల జీతాన్ని ఫిబ్రవరి నెల వేతనంతో అదనంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇలా కంపెనీ బోనస్‌ రూపంలో చెల్లిస్తున్న మొత్తం విలువ రూ.700 కోట్లు కావడం విశేషం. 2020, డిసెంబరు 31 నాటికి కంపెనీలో 1,59,682 మంది ఉద్యోగులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయిన 20 ఏళ్లలోనే ఈ చరిత్రాత్మక మైలురాయిని చేరుకోవడం.. ఉద్యోగుల కృషికి నిదర్శనమని సంస్థ అభిప్రాయపడింది. మహమ్మారి సంక్షోభంలోనూ ప్రతిఒక్కరూ ఎంతో నిబద్ధతతో పనిచేశారని కొనియాడింది.

ఇక డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,982 కోట్లకు చేరుకుంది. 2019తో పోలిస్తే 31.1 శాతం వృద్ధి కనబర్చింది. సంస్థ డిజిటల్‌, ప్రొడక్ట్స్‌, ప్లాట్‌ఫామ్‌ విభాగాల్లో పటిష్ఠమైన పనితీరు ఇందుకు దోహదపడింది. మున్ముందు త్రైమాసికాల్లో వ్యాపారం మరింత పుంజుకోనుందని హెచ్‌సీఎల్‌ టెక్‌ ధీమా వ్యక్తం చేసింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.4 మధ్యంతర డివిడెండ్‌ చెల్లించనున్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్‌ ప్రకటించింది.

ఇవీ చదవండి...

ముంబయి విమానాశ్రయంలో అదానీ ఎయిర్‌పోర్ట్స్‌కు మరో 23.5% వాటా

ప‌ద‌వీవిర‌మ‌ణ నిధిని పెంచుకోండి


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని