హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 500 నియామకాలు - HDFC Bank 500 Appointments
close

Published : 23/06/2021 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 500 నియామకాలు

సాంకేతికత మెరుగు కోసమే

ముంబయి: సాంకేతికత రూపాంతరీకరణ వ్యవస్థ కోసం రాబోయే రెండేళ్లలో 500 మంది నిపుణులను నియమించుకుంటామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రకటించింది. భవిష్యత్తులో మరిన్ని డిజిటల్‌ ఉత్పత్తులను ఆవిష్కరిస్తామని, ప్రస్తుత వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచుకుంటామని తెలిపింది. ఆన్‌లైన్‌ వ్యవస్థల్లో పలు అంతరాయాలు ఏర్పడటంతో, కొత్త డిజిటల్‌ ఉత్పత్తులను, క్రెడిట్‌కార్డుల జారీని నిలిపివేస్తూ గత డిసెంబరులో ఆర్‌బీఐ ఆదేశాలు ఇచ్చాక, టెక్నాలజీ వ్యవస్థలను పూర్తి ఆధునికంగా తీర్చిదిద్దాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నిర్ణయించిన సంగతి విదితమే. డేటా అనలిటిక్స్‌, కృత్రిమమేధ, మెషీన్‌ లెర్నింగ్‌, డిజైన్‌ థింకింగ్‌, క్లౌడ్‌ వంటి నైపుణ్యాలు కలిగిన 500 మంది ఉద్యోగులను ఇందుకోసం నియమించనున్నట్లు సంస్థ వెల్లడించింది.

ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి మర్చంట్‌ బ్యాంకర్లకు ప్రభుత్వ ఆహ్వానం

దిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో వ్యూహాత్మక వాటా విక్రయానికి తోడ్పాటు అందించేందుకు మర్చంట్‌ బ్యాంకర్లు, లీగల్‌ సంస్థల నుంచి బిడ్‌లను ప్రభుత్వం ఆహ్వానించింది. ఐడీబీఐ బ్యాంక్‌లో వ్యూహాత్మక వాటా విక్రయం, యాజమాన్య హక్కుల బదిలీకి మేలో కేంద్ర మంత్రవర్గం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీలకు సంయుక్తంగా 94 శాతానికి పైగా వాటాలు ఉన్నాయి. యాజమాన్య హక్కులు ఉన్న ఎల్‌ఐసీకి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం, నాన్‌-ప్రమోటర్‌ వాటాలు 5.29 శాతం చొప్పున ఉన్నాయి. లావాదేవీ సలహాదారులు, న్యాయ సలహాదారులు జులై 13లోగా బిడ్లు అందించాల్సిందిగా దీపం వెల్లడించింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని