close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 01/06/2020 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హెచ్‌ఎస్‌బీసీ వ్యూహ నిపుణుడిగా భారత సంతతి వ్యక్తి

లండన్‌: బ్రిటన్‌లో వ్యూహ నిపుణుడిగా భారత సంతతి వ్యక్తి చిరా బారువాను హెచ్‌ఎస్‌బీసీ నియమించింది. కరోనా వైరస్‌ వల్ల తలెత్తిన పరిస్థితుల నుంచి బ్యాంక్‌ను వృద్ధి బాట పట్టించడానికి హెచ్‌ఎస్‌బీసీ గ్రూప్‌ హెడ్‌ ఆఫ్‌ స్ట్రాటజీగా బారువా చేరారు. వచ్చే 5-10 ఏళ్లలో ఏ దేశాల్లో, ఏఏ ప్రాంతాల్లో హెచ్‌ఎస్‌బీసీ దృష్టి పెట్టాలో బారువా మదింపు చేయనున్నారు. అధిక రాబడుల కోసం ఆసియాలో హెచ్‌ఎస్‌బీసీ మరింత విస్తరించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బారువా ఇంతకు ముందు మెకిన్సే అండ్‌ కోలో పార్ట్‌నర్‌గా, అలయన్స్‌-బెర్న్‌స్టీన్‌లో విశ్లేషకుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం బ్యాంక్‌కు 64 దేశాల్లో 2,35,000 మంది ఉద్యోగులు ఉన్నారు. గత కొంతకాలంగా హెచ్‌ఎస్‌బీసీ రాబడుల కోసం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.