గృహ రుణ రేట్లు అందుకు తగ్గాయ్‌ - Here is why Banks Cut Home Loan Rates
close

Published : 08/03/2021 10:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గృహ రుణ రేట్లు అందుకు తగ్గాయ్‌

ఈ విభాగంలోనే ఎన్‌పీఏలు అతి స్వల్పం 
బ్యాంకుల్లో రూ.6.50 లక్షల కోట్ల ద్రవ్య లభ్యత

ముంబయి: గృహ రుణ రేట్లు దశాబ్దంలోనే కనిష్ఠానికి దిగి వచ్చాయి. ‘సాధారణ రుణ గిరాకీ ఆశించిన స్థాయి కంటే తక్కువగా 6 శాతంలోపే ఉండటం, బ్యాంకుల దగ్గర సుమారు రూ.6.5 లక్షల కోట్లకు పైగా ద్రవ్య లభ్యత ఉండటం.. గృహ రుణాల్లో నిరర్థక ఆస్తులు అతి తక్కువగా 1 శాతం లోపే ఉండటం’ ఇందుకు కారణాలని కేర్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. నిధులు ఇంతభారీగా బ్యాంకుల వద్ద నిరుపయోగంగా ఉంటే, వాటి నికర లాభంపై ప్రభావం చూపుతుంది. డిపాజిటర్లకు ప్రస్తుత కనీస వడ్డీ అయిన 2.5 శాతం చెల్లించడానికి అయినా, బ్యాంకులు తమ వద్ద అధికంగా నిధుల్ని తక్కువ వడ్డీకి అయినా రుణంగా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొంది. 

• గృహ రుణాల్లో వృద్ధి 2020-21లో కరోనా మహమ్మారి కారణంగా తగ్గింది. 2020 జనవరిలో 17.5 శాతంగా ఉండగా, 2021 జనవరి నాటికి 7.7 శాతానికి తగ్గింది. ఈ విభాగంలో స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు (ఎస్‌బీఐ) 0.67 శాతంగానే ఉన్నాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీకి కూడా 1 శాతంలోపే ఉన్నాయి.
• ఆర్థిక రికవరీ వల్ల గృహ కొనుగోళ్లు పెరుగుతాయని బ్యాంకులు భావిస్తున్నాయి. గృహ రుణాలకు ఆస్తి పత్రాలు తనఖాగా ఉంటాయి కాబట్టి నష్టభయం తక్కువగా ఉంటుంది. ఒకవేళ రుణగ్రహీత చెల్లించలేకపోయినా సదరు ఆస్తిని స్వాధీనం చేసుకుని వేలంలో విక్రయించొచ్చు.
• 2020 నవంబరు నాటికి బ్యాంకులు అందించిన గృహ రుణాలు సుమారు రూ.14.17 లక్షల కోట్లుగా ఉన్నాయి.  
• కరోనా ప్రభావంతో స్థిరాస్తి ధరలు ఆకర్షణీయంగా ఉండటం, కొవిడ్‌ వల్ల దెబ్బతిన్న ఈ రంగాన్ని ఆదుకునేందుకు కొన్ని రాష్ట్రాల్లో స్టాంప్‌ డ్యూటీ తగ్గించడం కూడా వినియోగదార్లకు ప్రయోజనం కలిగించే అంశాలే. ఇవన్నీ ఖాతాదార్లను ఆకర్షించేలా బ్యాంకులు నిర్ణయాలు తీసుకోడానికి కారణమయ్యాయి. 

రుణ రేట్లు ఇలా..

> ఎస్‌బీఐ        6.7%

కోటక్‌ బ్యాంక్‌    6.65%

హెచ్‌డీఎఫ్‌సీ    6.75%

ఐసీఐసీఐ బ్యాంక్‌    6.7%

గృహ రుణ మార్కెట్‌ వాటా..

> ఎస్‌బీఐ      34%

హెచ్‌డీఎఫ్‌సీ   19%

>ఐసీఐసీఐ బ్యాంక్‌  13%

ఇవీ చదవండి...
మహిళల ఆర్థిక భరోసాకు అడుగులివే...

అమెజాన్‌ లోకల్‌ షాప్స్‌లో 50,000కు పైగా వర్తకులు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని