Hero MotoCorp: హీరో వాహనాలు ఇక ప్రియం.. ధరలు పెంచనున్న కంపెనీ - Hero MotoCorp to increase price of model range by up to Rs 3000
close

Published : 16/09/2021 21:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Hero MotoCorp: హీరో వాహనాలు ఇక ప్రియం.. ధరలు పెంచనున్న కంపెనీ

దిల్లీ: దేశీయ అతిపెద్ద ఆటోమొబైల్‌ కంపెనీ హీరో మోటోకార్ప్‌ టూవీలర్‌ వాహన ధరలు పెంచనుంది. సెప్టెంబర్‌ 20 నుంచి అన్ని మోడళ్లపై ధరల పెంపు ఉంటుందని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. గరిష్ఠంగా రూ.3వేల వరకూ ఈ పెంపు ఉంటుందని పేర్కొంది. ఏ మోడల్‌పై ఎంత పెంచేది కంపెనీ వెల్లడించలేదు.

వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ధరల పెంపు అనివార్యమైందని కంపెనీ తెలిపింది. మోటార్‌ సైకిల్‌, స్కూటర్లపై మోడళ్లను బట్టి ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొంది. మరోవైపు రాబోయే పండగ సీజన్‌లో వాహన అమ్మకాలు జోరందుకుంటాయని కంపెనీ ఆశాభావం వ్యక్తంచేసింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని