పొగ తాగేవారు అధిక ప్రీమియంచెల్లించాలి - High-Insurance-premium-for-smokers
close

Published : 16/03/2021 16:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పొగ తాగేవారు అధిక ప్రీమియంచెల్లించాలి

నిర్మాణ కార్మికులు, బొగ్గు మైనర్లు, జైలు అధికారులు వంటి తక్కువ-రిస్క్ ఉన్న ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ పొగ‌తాగే అల‌వాటు ఉన్న‌వారు, సాధార‌ణ వ్య‌క్తుల‌ కంటే అధిక ప్రీమియం చెల్లించాలి. పాల‌సీ తీసుకునే ముందు దీని గురించి వివ‌రంగా తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. 

పాలసీ తీసుకునేవారి ఉద్యోగ ప్రొఫైల్‌ను పరిగణనలోకి తీసుకుని లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం లెక్కిస్తారు. అధిక-రిస్క్ జాబ్ ప్రొఫైల్స్ ఉన్నవారికి జీవిత బీమా ప్రీమియం చాలా ఎక్కువగా ఉండగా, బ్యాంకర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వంటి తక్కువ-రిస్క్ జాబ్ ప్రొఫైల్స్ ఉన్నవారు జీవిత బీమా పాలసీకి తక్కువ ప్రీమియం చెల్లిస్తారు.

సంబంధిత ప్రీమియంలను అంచనా వేయడానికి ప్రతి పరిశ్రమను ధూమపానం చేసేవారు,  చేయనివారుగా విభజించడం ద్వారా, సాపేక్షంగా తక్కువ-రిస్క్ జాబ్ ప్రొఫైల్ పరిశ్రమలో పొగ‌తాగ‌ని వారి కంటే, తాగేవారే  జీవిత బీమా కోసం ప్రతి నెలా గణనీయంగా ఎక్కువ చెల్లిస్తున్నారని డేటా వెల్లడించింది.

రిస్క్‌లో ఉన్న‌ ఉద్యోగ ప్రొఫైల్స్ కంటే పొగ‌తాగేవి జీవిత బీమా ప్రీమియం అధికంగా ఉంటుంది. అత్యధిక రిస్క్ జాబ్ ప్రొఫైల్స్ కూడా మరణానికి దారితీసే అవకాశం లేకపోగా, పొగ‌తాగితే ప్రాణాంతక వ్యాధుల సమృద్ధికి ప్రధాన కారణం. పొగాకు, ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్, క్షయ, గుండె జబ్బులు, స్ట్రోకులు, బ్రోన్కైటిస్, వంధ్యత్వం, పెప్టిక్ అల్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది.

ధూమపానం వల్ల ఆరోగ్యానికి ప్రమాదాలు:
జీవిత బీమా ప్రీమియంలు, జనాభాలోని వివిధ సమూహాల మరణాల పట్టికలపై ఆధారపడి ఉంటాయి. ఈ గణాంకాలు జనాభాకు టర్మ్ కవర్ అందించేటప్పుడు బీమా సంస్థ అందించే హామీని నిర్ణయిస్తాయి
  మరణాల ప్రమాదం ఎక్కువగా ఉంటే, ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ధూమపానం అనేది ఆరోగ్యానికి హాని కలిగించే వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది మరణాల ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల, పొగ‌తాగ‌ని వారితో పోలిస్తే, తాగేవారికి అధిక ప్రీమియం వసూలు చేస్తారు. మీరు అప్పుడప్పుడు  పొగ‌తాగినా‌,  బీమా పరిభాషలో ధూమపానం విభాగంలో పరిగణించబడతారు, దీంతో అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

సాధారణంగా, ధూమపానం చేసేవారి, మరణాల రేట్లు ఎక్కువగా ఉండటం వ‌ల‌న బీమా సంస్థకు ఎక్కువ రిస్క్ ఉంటుంది. అదేవిధంగా  పొగతాగేవారే  నుంచే క్లెయిమ్‌లు ఎక్కువ‌గా అవకాశం ఉంది. అందువల్ల, బీమా సంస్థలు ఈ పాల‌సీదారుల‌కు ఎక్కువ ఛార్జీల‌తో అదనపు రిస్క్ కవర్‌ను అందిస్తాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని