వృద్ధిపై అచంచల విశ్వాసం  - High confidence on india economys rebounce
close

Published : 12/03/2021 15:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వృద్ధిపై అచంచల విశ్వాసం 

ఆదాయాలూ పెరుగుతాయ్‌ 
పీడబ్ల్యూసీ సర్వేలో సీఈఓలు

దిల్లీ: ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింతగా పుంజుకుంటుందనే ఆశాభావాన్ని వివిధ దేశాల్లోని కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులు (సీఈఓ) వ్యక్తం చేస్తున్నారు. రాబోయే 11 నెలల్లో ఆదాయ వృద్ధి అంచనాలపైనా సానుకూల దృక్పథాన్ని కనబరుస్తున్నారు. పీడబ్ల్యూసీ నిర్వహించిన 24వ వార్షిక గ్లోబల్‌ సీఈఓ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. భారత్‌ సహా 100 దేశాలకు చెందిన 5,050 మంది సీఈఓలు ఈ సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. జనవరి- ఫిబ్రవరి మధ్య నిర్వహించిన ఈ సర్వే వివరాలు ఇలా...

*ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం 2021లో మెరుగవుతుందని 76 శాతం మంది ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ వృద్ధిపై ఆశావహ దృక్పథంతో ఉన్నామని 2020లో కేవలం 22 శాతం మంది చెప్పగా.. 2019లో ఈ తరహా అభిప్రాయాన్ని 42 శాతం మంది వ్యక్తం చేశారు. 2012లో మొదటి సారిగా సర్వేలో ఈ ప్రశ్న అడిగినప్పటి నుంచి, ఎక్కువ మంది సీఈఓలు ప్రపంచ వృద్ధిపై సానుకూలంగా ఉండటం ఇదే మొదటిసారి.
*రాబోయే 12 నెలల్లో తమ సంస్థల ఆదాయాలు మరింతగా పెరుగుతాయని బలంగా నమ్ముతున్నట్లు 36 శాతం మంది సీఈఓలు వెల్లడించారు. 2020లో ఇలా చెప్పిన సీఈఓలు 27 శాతం మందే.
*ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఉత్తర అమెరికా, పశ్చిమ ఐరోపా సీఈఓలే అత్యధిక విశ్వాసంతో ఉన్నారని సర్వే గుర్తించింది.
*రాబోయే 12 నెలల్లో ప్రపంచ వృద్ధిపై సీఈఓల్లో ఆశావహ దృక్పథానికి సంబంధించి అమెరికా ముందు వరుసలో ఉంది. ఈ దేశ సీఈఓల్లో 35 శాతం మంది ఈ ధోరణితో ఉన్నారు. చైనా (28 శాతం), జర్మనీ (17%) దేశాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. భారత్‌ను (8%) వెనక్కి నెట్టి బ్రిటన్‌ (11%) నాలుగో స్థానంలో నిలిచింది. భారత్‌ ఐదో స్థానానికి దిగిరాగా.. జపాన్‌ ఆరోస్థానానికి ఎగబాకింది.
*వాతావరణ మార్పులపై 30 శాతం మంది సీఈఓలు సర్వేలో ఆందోళన వ్యక్తం చేశారు. 2020లో వాతావరణ మార్పులపై ఆందోళన వ్యక్తం చేసిన సీఈఓలు 24 శాతమే. వృద్ధికి ముప్పుగా భావిస్తున్న తొలి 10 అంశాల్లో వాతావరణ మార్పు అంశం తొమ్మిది స్థానంలో ఉంది.
*మహమ్మారులు, ఆరోగ్య సంక్షోభాలే ఆర్థిక వ్యవస్థకు  ప్రధానమైన ముప్పుగా సీఈఓలు భావిస్తున్నారు.

ఇవీ చదవండి...

చదువుల ఖర్చులు తట్టుకునేలా..

ఈ కంపెనీ ఐపీవోకు భారీ డిమాండ్‌?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని