పెట్రో ధరలు భారమే, కానీ: నిర్మలా సీతారామన్‌ - High petrol diesel prices burden on consumers says FM
close

Published : 05/03/2021 19:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెట్రో ధరలు భారమే, కానీ: నిర్మలా సీతారామన్‌

దిల్లీ: పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల వల్ల ప్రజలపై భారం పడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఆ భారాన్ని తగ్గించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. శుక్రవారం దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమం సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆమె ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వినియోగదారులపై భారం పడుతున్న మాట వాస్తవమే అయినా కేంద్రం మాత్రమే పన్నులు వేయడం లేదన్నారు. రాష్ట్రాలు కూడా పన్నులు వసూలు చేస్తున్నాయని చెప్పారు. కేంద్రం వసూలు చేసే పన్నుల వాటాలో 41 శాతం రాష్ట్రాలకు వెళ్తోందని గుర్తుచేశారు. ఈ వ్యవహారం కేంద్ర, రాష్ట్రాల మధ్య ముడిపడి ఉంది కాబట్టి కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. దీనిపై జీఎస్టీ మండలిలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తదుపరి జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్రం దీనిపై ప్రతిపాదన తీసుకొస్తుందా? అని ప్రశ్నించగా.. సమావేశం తేదీ దగ్గరపడినప్పుడు ఆలోచన చేస్తామని చెప్పారు. మరోవైపు ఇదే సమావేశంలో తాప్సీ, అనురాగ్‌ కశ్యప్‌ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులపైనా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందించారు. వారి పేర్లు నేరుగా ప్రస్తావించకుండా 2013లోనూ వారి ఇళ్లపై దాడులు జరిగాయని గుర్తుచేశారు. అప్పుడు లేని సమస్య ఇప్పుడే ఎందుకు ఉత్పన్నమవుతోందని ఎదురు ప్రశ్నించారు. తాప్సీ, అనురాగ్‌ కశ్యప్‌ రైతు ఉద్యమానికి మద్దతు పలకడం వల్లే వారిపై కేంద్రం దాడులు చేయించిందన్న విమర్శల నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇవీ చదవండి..
ఎస్‌బీఐ బాటలో ఐసీఐసీఐ.. వడ్డీరేటు తగ్గింపు
జియో ల్యాప్‌టాప్‌లు వచ్చేస్తున్నాయట!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని