గృహ రుణం పొందేందుకు అర్హ‌త‌ను పెంచుకోండిలా.... - Home-loan-eligibility
close

Published : 12/01/2021 16:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గృహ రుణం పొందేందుకు అర్హ‌త‌ను పెంచుకోండిలా....

గృహ రుణం పొందేందుకు బ్యాంకులు వినియోగ‌దారుడి అర్హ‌త‌ను ప‌రిశీలిస్తాయి. అర్హ‌త‌ను ముందే తెలుసుకొని ఎంత రుణం పొంద‌వ‌చ్చో ఒక అంచ‌నాకు రావొచ్చు. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే వ‌డ్డీ రేట్లు కూడా త‌క్కువ‌గా ఉండే అవకాశం ఉంటుంది. గృహ రుణ అర్హ‌త‌ను పెంచుకునేందుకు వివిద మార్గాలు ఉంటాయి. అందులో కొన్ని ప‌రిశీలిస్తే…

అర్హ‌త‌:
గృహ రుణం అర్హ‌త అంటే మీకు బ్యాంకు ఎంత‌మేర‌కు రుణం ఇవ్వ‌గ‌ల‌దో తెలుసుకోవడం. బ్యాంకులు ద‌ర‌ఖాస్తుదారుడి ఆర్థిక స్థితి, నెల‌వారి ఆదాయం, వృత్తి, సంస్థ‌, వ‌య‌సు, క్రెడిట్ రేటింగ్, ఆస్తులు వంటివి అన్నీ ప‌రిశీలిస్తారు. మీ నెల‌వారి ఆదాయాన్ని ముఖ్య‌మైన అంశంగా బ్యాంకులు ప‌రిగ‌ణిస్తాయి. సంపాద‌న బాగుంటే ఎక్కువ మొత్తంలో రుణం పొందే అవ‌కాశం ఉంటుంది. గ‌రిష్ఠ రుణ మొత్తం ఆస్తి విలువ‌లో 75 శాతం నుంచి 90 శాతం వ‌ర‌కు ఉంటుంది.

బ్యాంకులు రుణం ఇచ్చేందుకు ప‌రిశీలించే అంశాలు:

* గ‌త రుణ చ‌రిత్ర‌
* క్రెడిట్ స్కోర్ 750, అంత‌కంటే ఎక్కువ‌
ఆదాయం:
* క్రెడిట్ కార్డు బిల్లులు, రుణాలు ఉండ‌కూడ‌దు
* ఆదాయం పొందుతున్న‌ భార్య లేదా భ‌ర్త‌ను స‌హ‌-ద‌ర‌ఖాస్తుదారుగా ఎంచుకోవాలి.
* ఆరు ర‌కాలుగా అర్హ‌త‌ను పెంచుకునే అవ‌కాశం

రుణాల‌ను చెల్లించండి:
* ఇప్ప‌టికే ఉన్న రుణాల‌ను చెల్లిస్తే తిరిగి రుణం పొందేందుకు అనుకూలంగా ఉంటుంది. బ్యాంకులు మీకు రుణం ఇచ్చే ముందు ఆదాయం, రుణ నిష్ప‌త్తిని ప‌రిశీలిస్తాయి. అంటే మీకు వ‌చ్చే ఆదాయంలో ఎంత‌మేర‌కు రుణాల చెల్లించేందుకు కేటాయిస్తున్నార‌ని తెలుసుకుంటారు.
* క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోండి
* క్రెడిట్ స్కోర్ అనేది రుణ అర్హ‌త‌ను నిర్ణ‌యిస్తుంది. రుణం కోసం దాఖ‌లు చేసిన‌ప్పుడు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థ‌లు క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేస్తాయి. క్రెడిట్ స్కోర్ బాగుంటే ఎక్కువ రుణం పొందే అవ‌కాశం ఉంటుంది. వ‌డ్డీ రేట్ల‌కు కూడా త‌క్కువ‌కు పొంద‌వ‌చ్చు. క్రెడిట్ స్కోర్‌ను పెంచుకునేందుకు చాలా మార్గాలున్నాయి.
ఉమ్మ‌డి రుణాలు:
సుల‌భంగా రుణం పొందేందుకు మ‌రో మార్గం ఉమ్మ‌డి రుణాలు. ఆదాయం పొందుతున్న జీవిత‌ భాగ‌స్వామితో క‌లిపి రుణం కోసం దాఖ‌లు చేస్తే, వారికి మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. దీంతో త‌క్కువ వ‌డ్డీతో ఎక్కువ రుణం పొందే అవ‌కాశం ఉంటుంది.
ఎక్కువ కాల‌ప‌రిమితి:
సాధార‌ణంగా ఎక్కువ కాల‌ప‌రిమితి ఎంచుకుంటే రుణ అర్హ‌త పెంచుకోవ‌చ్చు. కాల‌ప‌రిమితి ఎక్కువ‌గా పెంచుకున్న‌ప్పుడు రుణం చెల్లించేందుకు ఇంకా చాలా స‌మ‌యం ఉంద‌ని సూచిస్తుంది. దీనిని బ్యాంకులు అనుకూల అంశంగా ప‌రిగ‌ణించి రుణం జారీ చేసేందుకు అవ‌కాశం ఉంటుంది.
ఇత‌ర ఆదాయం:
కేవ‌లం వేత‌న ఆదాయం కాకుండా ఇత‌ర ఆదాయాన్ని కూడా చూపితే రుణం ల‌భించేందుకు ఆస్కారం ఎక్కువ‌గా ఉంటుంది. అది అద్దె ఆదాయం, వ్యాపారంలో భాగ‌స్వామ్యం ద్వారా వ‌చ్చిన ఆదాయం వంటిది. దీనికోసం బ్యాంకుల‌కు త‌గిన ఆధారాల‌ను చూపాలి. దీంతో మెరుగైన ఆర్థిక ప‌రిస్థితి ఉంద‌ని గుర్తించిన సంస్థలు రుణం ఇచ్చేందుకు సుముఖ‌త చూపుతాయి.
స్టెప్ అప్ లోన్స్‌:
త‌క్కువ వేత‌నం ఉన్న‌వారికి ఈ రుణాలు స‌రైన‌వ‌ని చెప్పుకోవ‌చ్చు. ఇందులో మొద‌టి సంవ‌త్స‌రంలో త‌క్కువ ఈఎమ్ఐ చెల్లించాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత ద‌శ‌ల‌వారిగా ఈఎమ్ఐ పెరుగుతూ వ‌స్తుంది. ఈ రకంగా స్టెప్ అప్ లోన్స్ ఎంచుకుంటే ఎక్కువ రుణం పొందే అవ‌కాశం ఉంటుంది.
చివ‌ర‌గా:
ఇల్లు కొనుగోలు చేయ‌డం అనేది ముఖ్య‌మైన అంశం. అందుకే ఇంటి రుణం కోసం దాఖ‌లు చేసేముందు తొంద‌ర‌ప‌డ‌కుండా ముందుగా ఇవ‌న్నీ విష‌యాల‌ను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాలి. సిబిల్ స్కోర్ చెక్ చేసుకొని అన్ని బ్యాంకుల్లో రుణం పొందే అవ‌కాశం, వ‌డ్డీ రేట్ల‌ను ప‌రిశీలించండి. దీంతో సుల‌భంగా, ఎక్కువ‌గా రుణం పొంద‌వ‌చ్చు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని