మార్కెట్లోకి హోండా సీబీ350ఆర్‌ఎస్‌ - Honda CB350 RS Launched In India
close

Published : 16/02/2021 22:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్కెట్లోకి హోండా సీబీ350ఆర్‌ఎస్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: జపాన్‌కు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం హోండా భారత మార్కెట్లో సరికొత్త బైకును ప్రవేశపెట్టింది. హచ్‌’నెస్‌ సీబీ 350 ఆర్‌ఎస్‌ పేరుతో ప్రవేశపెట్టిన ఈ బైకు ధర(దిల్లీ ఎక్స్‌షోరూం)లో రూ.1.96లక్షలుగా నిర్ణయించారు. దీనిలో ఆర్‌ఎస్‌ అంటే ‘రోడ్‌ సెయిలింగ్‌’. వచ్చే నెల మొదటి వారంలో ఇది వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. నేటి నుంచి బైకు కోసం బుకింగ్స్‌ స్వీకరణ మొదలుపెట్టారు.

ఈ సరికొత్త సీబీ 350 ఆర్‌ఎస్‌ బైకు ఫ్యూయల్‌ ట్యాంక్‌ ఆకర్షణీయమైన రెండు రంగులతో వస్తుంది. వృత్తాకారంలోని ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌ అదనపు ఆకర్షణగా నిలిచింది. సుదీర్ఘ ప్రయాణాలకు అనుగుణంగా ఈ బైకును తీర్చిదిద్దారు. టక్‌ అండ్‌ రోల్‌ మోడల్‌ సీటు, ఎల్‌ఈడీ టెయిల్‌ లైట్‌, డిజిటల్‌ ఇనుస్ట్రుమెంట్‌ కన్సోల్‌, డ్యూయల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌, హోండా సెలక్ట్‌బుల్‌ టార్క్ కంట్రోల్‌ వంటివి అమర్చారు.

దీనిలో అమర్చిన సింగిల్‌ సిలిండర్‌ 348 సీసీ ఇంజిన్‌ 5,500 ఆర్‌పీఎం వద్ద 20.8 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. 3,000 ఆర్‌పీఎం వద్ద అత్యధికంగా 30ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనికి 5స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను అమర్చారు. ఈ మోటార్‌ సైకిల్‌ రాయల్‌ ఎన్ఫీల్డ్‌ మెటియోర్‌ 350,క్లాసిక్‌ 350, జావా ఫార్టీటూ వంటి వాటికి పోటీగా హోండా మార్కెట్లోకి తెచ్చింది. 

ఇదీ చదవండి

శాట్‌లో ఫ్యూచర్‌ ‌గ్రూప్‌నకు ఊరట
 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని