close

తాజా వార్తలు

Published : 24/09/2020 00:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మొబైల్‌లోనే కార్ల షోరూం

దిల్లీ: కరోనా కరాళ నృత్యం చేస్తుండటంతో  కొనుగోలుదారులు బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు.  ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అయిన హోండా అమ్మకాలను పెంచుకోవడానికి వినూత్న పద్దతిని మొదలు పెట్టింది. కొనుగోలు దార్ల చెంతకే  కార్ల షోరూమ్‌లను తీసుకొచ్చింది.  వర్చువల్‌ షోరూమ్‌లు ఏర్పాటు చేసినట్లు  ఆ సంస్థ  బుధవారం ప్రకటించింది. ఈ విధానంలో  కొనుగోలుదారులు ఇంట్లోనే కూర్చొని కార్లను డిజిటల్‌గా వీక్షించవచ్చు.  కంపెనీ వెబ్‌సైట్‌లో వర్చువల్‌ షోరూమ్‌ అందుబాటులో ఉంది.

‘‘హోండా షోరూమ్‌కు వెళ్లి మీరు కార్లను వీక్షిస్తే ఎటువంటి అనుభూతి చెందుతారో ఈ వర్చువల్‌ విధానం ద్వారా కూడా అటువంటి అనుభూతే కలుగుతుంది.  కంప్యూటర్‌లు, స్మార్ట్‌ ఫోన్‌లలోని బ్రౌజర్‌ల ద్వారా  ఈ షోరూమ్‌లను వీక్షించవచ్చు.  జీవితం మొత్తం డిజిటల్‌గా మారింది. ఆన్‌లైన్‌లో కార్లను కొనుగోలు చేసేవారు అధికం  అవుతున్నారు.అందువల్ల ఈ షోరూమ్‌లు ఏర్పాటు చేస్తున్నాం’’అని హోండా కార్స్‌ ఇండియా  సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌, సేల్స్‌)  రాజేష్‌ గోయల్‌  అన్నారు. ఈ వర్చువల్‌ షోరూమ్‌లు కార్ల అమ్మకాలను పెంచుకోవడానికి దోహదపడతాయని  ఆ సంస్థ చెప్పింది.  ప్రస్తుతం హోండాకు దేశవ్యాప్తంగా 350 మంది డీలర్‌లు ఉన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.