close

Published : 17/04/2021 16:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

77,954 హోండా కార్లు వెనక్కి

దిల్లీ: దేశవ్యాప్తంగా 77,954 కార్లను హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌సీఐఎల్‌) వెనక్కి పిలిపించనుంది. లోపాలున్న ఇంధన పంపులను సరిచేయడంలో భాగంగా ఈ రీకాల్‌ చేపట్టింది. 2019 జనవరి నుంచి 2020 సెప్టెంబరు మధ్య తయారైన అమేజ్, 4వ తరం సిటీ, డబ్ల్యూఆర్‌-వి, జాజ్, సివిక్, బీఆర్‌-వి, సీఆర్‌వీ మోడళ్లపై ఈ రీకాల్‌ ప్రభావం పడనుంది. ఈ కార్లలోని ఇంధన పంపుల్లో లోపాలున్న ఇంపెలర్ల వల్ల ఇంజిన్‌ ఆగిపోవడం, ప్రారంభం కాకపోవడం జరగొచ్చని హోండా కార్స్‌ తెలిపింది. 2019 జనవరి- ఆగస్టు మధ్య ఉత్పత్తి చేసిన 36,086 అమేజ్‌ కార్లు, 2019 జవనరి- సెప్టెంబరు మధ్య తయారైన 20,248 నాలుగో తరం సిటీ కార్లు, 2019 జనవరి- సెప్టెంబరు మధ్య తీసుకొచ్చిన 5170 సివిక్‌ కార్లు, 2019 జనవరి- అక్టోబరు మధ్య తయారైన 1737 బీఆర్‌-విలు, 2019 జనవరి- 2020 సెప్టెంబరు మధ్య విడుదలైన 607 సీఆర్‌వీ కార్లకు ఈ రీకాల్‌ వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. నేటి నుంచి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న హెచ్‌సీఐఎల్‌ డీలర్ల వద్ద లోపాలను ఉచితంగా గుర్తించి, కొత్త పరికరంతో భర్తీ చేస్తామని తెలిపింది. దీని కోసం వినియోగదారులను కంపెనీ నేరుగా సంప్రదిస్తుందని కంపెనీ వెల్లడించింది.

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని