Honda:హోండా ద్విచక్ర వాహనాలకు బ్లూటూత్‌? - Honda Motorcycle And Scooter India May Introduce Bluetooth Connectivity On Its Two Wheelers
close

Published : 26/05/2021 18:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Honda:హోండా ద్విచక్ర వాహనాలకు బ్లూటూత్‌?

ఇంటర్నెట్‌డెస్క్‌: త్వరలో హోండా మోటార్‌ సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా ద్విచక్ర వాహనాలకు బ్లూటూత్‌ సౌకర్యం కల్పించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి రోడ్‌సింక్‌ పేరుతో ట్రేడ్‌మార్క్‌కు మార్చిలో దరఖాస్తు చేసుకుంది. ఇప్పుడు దానికి ఆమోదం లభించింది. ఇది హోండా సొంతగా అభివృద్ధి చేసిన యాప్‌. ఇది వాయిస్‌ కంట్రోల్‌ విధానంతో పనిచేస్తుంది. ఇప్పటికే హోండా  H'Ness CB 350 బైకులో ఇలాంటిదే వినియోగిస్తున్నారు. ఇది బ్లూటూత్‌ కనెక్షన్‌ ఆధారంగా పనిచేస్తుంది.

భారత్‌లో ద్విచక్ర వాహనాలకు బ్లూటూత్‌ కనెక్టివిటీ మూడేళ్ల క్రితం టీవీఎస్‌ ఎన్‌టార్క్‌తో మొదలైంది. ప్రస్తుతం టీవీఎస్ హీరోమోటో కార్ప్‌, సుజుకీ, రాయల్‌  ఎన్‌ఫీల్డ్‌ సంస్థలు ఈ ఫీచర్‌ను ఆఫర్‌ చేస్తున్నాయి. నేవిగేషన్‌, కాల్‌ అలర్ట్‌, ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌, వంటి సౌకర్యాలు వీటిల్లో ఉన్నాయి. హోండా కూడా ఇటువంటి ఫీచర్లనే మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు వెహికల్‌ డయాగ్నస్టిక్‌, జియో ఫెన్సింగ్‌, మ్యూజిక్‌ వంటి ఫీచర్లను అదనంగా జత చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాకపోతే ఈ ఫీచర్‌ స్టాండర్డ్‌గా అన్నింటికి  అందిస్తుందా.. లేదా అప్షనల్‌గా ఇస్తుందా అనేది తెలియాలంటే హోండా ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని