హోండా బైక్‌పై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ - Honda Motorcycle And Scooter India Offers Cashback On SP 125
close

Updated : 30/12/2020 16:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హోండా బైక్‌పై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా ఎస్‌పీ 125 బైక్‌పై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. దీంతో వినియోగదారులకు రూ.5వేల వరకు లబ్ధి చేకూరనుంది. హోండాతో ఒప్పందం చేసుకున్న బ్యాంకుల నుంచి ఫైనాన్స్‌ తీసుకున్న వినియోగదారలకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఫెడరల్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, స్టాండర్డ్‌ ఛార్టర్‌ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌ వీటిల్లో ఉన్నాయి.

ప్రస్తుతం రెండు రకాల వేరియంట్లలో హోండా ఎస్‌పీ125 అందుబాటులో ఉంది. వీటిలో డ్రమ్‌బ్రేక్‌ వెర్షన్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.75,010గా ఉండగా.. డిస్క్‌బ్రేక్‌ వెర్షన్‌ రూ.79,210గా ఉంది. ఇటీవలే హోండా షైన్‌ 90లక్షల విక్రయాల మార్కును దాటింది.  14ఏళ్ల  క్రితం మార్కెట్లోకి విడుదల చేసిన ఈ మోడల్‌  125 విభాగంలో అత్యధికంగా విక్రయించే బైకుగా నిలిచింది. దీని విక్రయాలు ఏటా 26శాతం పెరుగుతున్నాయి.

ఇవీ చదవండి

కొత్త రకాన్ని ఎదుర్కొనేలా టీకాను మార్చొచ్చా?

కరుణ రసం: ట్రంప్‌లో కొత్తకోణం..!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని