Honda Shine: హోండా షైన్‌పై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ - Honda Shine Offered With Cashback Of Up To rs. 3500
close

Published : 18/05/2021 21:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Honda Shine: హోండా షైన్‌పై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: హోండా మోటార్స్‌ అండ్‌ సైకిల్స్‌ ఇండియా షైన్‌ బైక్‌పై ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు రూ.3,500 క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ జూన్‌ 30వ తేదీ వరకు అమల్లో ఉండనుంది. ఈఎంఐ పథకాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే ఈ స్కీం వర్తిస్తుంది. వారు కనీసం రూ.40,000ను బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు నుంచి వినియోగించాలి. గతంలో కూడా హోండా లివో, గ్రాజియా, యాక్టివా 125 ఇతర మోటార్‌ సైకిళ్లపై ఆఫర్లను ప్రకటించింది.

ప్రస్తుతం 125 సీసీ ఇంజిన్‌తో వచ్చే షైన్‌ సీబీ 10.72 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. దీనిలో 5స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను అమర్చారు. బీఎస్‌6 ఇంజిన్‌తో షైన్‌ డ్రమ్‌బ్రేక్‌ వేరియంట్‌ ఎక్స్‌షోరూం ధర రూ.71,550,  డిస్క్‌ బ్రేక్‌ వేరియంట్‌ ధర రూ.76,346గా ఉంది. జులై 31వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలో వారెంటీ, ఫ్రీ సర్వీసులను పొడిగించింది.  ఈ అవకాశం భారత్‌లో ఏప్రిల్‌1 నుంచి మే 31లో ఫ్రీ సర్వీసుల గడువు ముగిసిపోయే కస్టమర్లకు వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. వారు తమ సర్వీసులను జులై 31లోపు ఉచితంగా చేయించుకోవచ్చు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని