Housing sales: 8 ప్రధాన నగరాల్లో ఊపందుకున్న గృహ విక్రయాలు..! - Housing sales on recovery road
close

Updated : 18/10/2021 19:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Housing sales: 8 ప్రధాన నగరాల్లో ఊపందుకున్న గృహ విక్రయాలు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాల్లో వృద్ధి నమోదైంది. జులై-సెప్టెంబర్‌ మధ్య కాలంలో 59శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం 55,907 యూనిట్స్‌ను విక్రయించినట్లు ప్రాప్‌ టైగర్‌.కామ్‌ సంస్థ లెక్కలు చెబుతున్నాయి. గత త్రైమాసికంతో పోల్చుకొంటే డిమాండ్‌ మూడు రెట్లు పెరిగింది. ఈ త్రైమాసికంలో కేవలం 15,968 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో విక్రయాలు బాగా తగ్గాయి. 

ఇక గతేడాది జులై-సెప్టెంబర్‌  త్రైమాసికంలో విక్రయాలు 35,132 యూనిట్లు మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టగానే విక్రయాలు ఊపందుకొన్నట్లు ఈ సంస్థ నివేదిక రియల్‌ ఇన్‌సైట్‌లో పేర్కొంది. చాలా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ఈ సీజన్‌లో విక్రయాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశాయి. ఇక ఈ పండుగల సీజన్‌లో భారీగా అమ్మకాలు ఉండొచ్చని అంచనావేసింది. హైదరాబాద్‌లో గత త్రైమాసికంలోని 3,260 యూనిట్లతో పోల్చుకొంటే ఈ సారి రెట్టింపై 7,812కు విక్రయాలు చేరాయి. ఈ త్రైమాసికంలో బెంగళూరులో 6,557, చెన్నైలో 4,665, దిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్‌లో 4,458, కోల్‌కతాలో 2,651,ముంబయిలో అత్యధికంగా 92శాతం పెరిగి 14,163కు చేరాయి. పుణేలో 10,128 యూనిట్లు అమ్ముడు పోయాయి. 


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని