బీమా నుంచి ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌ర‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాలు - How-Government-schemes-helpful-for-people
close

Published : 16/02/2021 16:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బీమా నుంచి ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌ర‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాలు

అవ‌స‌రాల కోసం అప్పు చేయ‌డం కొత్త విష‌యం ఏం కాదు. అయితే దానికంటే ముందు ప్ర‌భుత్వం అందిస్తున్న ప‌థ‌కాల గురించి తెలుసుకొని స‌ద్వినియోగం చేసుకుంటే రుణ భారం పెర‌గ‌కుండా ఉంటుంది.

బ్యాంకు ఖాతా:

చాలా వ‌ర‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాల నుంచి ల‌భించే స‌బ్స‌డీ బ్యాంకు ఖాతాల‌కే చేరుతుంది. ఒక‌వేళ మీకు బ్యాంకు ఖాతా లేక‌పోతే ప్ర‌ధాన మంత్రి జ‌న్ ధ‌న్ యోజ‌న ఖాతాను ప్రారంభించాలి. దీంతో ఖాతాదారుల‌కు రూ.30 వేల జీవిత‌ బీమా, ల‌క్ష రూపాయ‌ల హామీ క‌లిగిన ప్ర‌మాద బీమా క‌వ‌ర్ ఉచితంగా ల‌భిస్తాయి. అయితే ఆధార్ త‌ప్ప‌నిస‌రి ఉండాలి.

ట‌ర్మ్ బీమా:

ఇంట్లో సంపాదించే వ్య‌క్తి ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణిస్తే కుటుంబ‌స‌భ్యులు తీవ్రంగా న‌ష్ట‌పోతారు. పిల్ల‌ల చ‌దువులు కొన‌సాగించ‌డం క‌ష్ట‌త‌రంగా మారుతుంది. అదే ట‌ర్మ్ బీమా తీసుకుంటే కుటుంభానికి భ‌రోసా ల‌భిస్తుంది. ప్ర‌భుత్వం అందిస్తున్న ప్ర‌ధాన మంత్రి జీవ‌న జ్యోతి బీమా యోజ‌న్ (పీఎంజేజేబీవై) తీసుకోవాలి. 18 నుంచి 50 సంవ‌త్స‌రాల వ‌య‌సు ఉన్న‌వారు సంవ‌త్స‌రానికి రూ.330 ప్రీమియం చెల్లిస్తే రూ.2 ల‌క్ష‌ల బీమా హామీ ల‌భిస్తుంది. ప్రీమియం ఖాతా నుంచి నేరుగా (ఆటో-డెబిట్) అయ్యే విధంగా ఆప్ష‌న్ ఎంచుకోవ‌చ్చు.

ప్ర‌మాద బీమా:

ప్ర‌జా ర‌వాణా ద్వారా ప్ర‌యాణం చేస్తున్న‌ప్పుడు ఏదైనా ప్ర‌మాదం జ‌రిగితే లేదా ఉద్యోగులు వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా క‌వ‌ర్ క‌లిగి ఉంటే మ‌ర‌ణం లేదా అంగ‌వైకల్యం సంభ‌వించిన‌ప్పుడు రూ.5 ల‌క్ష‌ల బీమా హామీ ల‌భిస్తుంది. దీనికి ఏడాదికి రూ.750 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రధాన‌మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న (పీఎంఎస్‌బీవై) ప‌థ‌కాన్ని రూ.12 సంవ‌త్స‌రానికి ప్రీమియం చెల్లించి ఎంచుకోవ‌చ్చు. దీనిపై ల‌క్ష నుంచి రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు బీమా హామీ ఉంటుంది.

ఆరోగ్య బీమా:

అంటువ్యాదులు, ప్ర‌మాదాల వ‌ల‌న ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. కేవ‌లం ఆరోగ్య సంరక్షణ ఖర్చుల వల్ల ప్రతి సంవత్సరం 5.50 కోట్ల మంది భారతీయులు పేదరికంలోకి వెళ్తున్నార‌ని 2018 లో బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ఒక నివేదిక పేర్కొంది. అందుకే ఆరోగ్య విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాలి. దీనికోసం మీరు రాష్ర్ట‌, కేంద్ర ప్ర‌భుత్వాలు అందించే ఆరోగ్య బీమా ప‌థ‌కాల‌ను తీసుకోవాలి. ప్ర‌ధాన మంత్రి జ‌న ఆరోగ్య యోజ‌న ప‌ట్ట‌ణాల్లో అసంఘ‌టిత రంగాల‌కు చెందిన కార్మికుల కొర‌కు ప్రారంభించారు. దీనికి ప‌థ‌కాన్ని కొనుగోలు చేయాల్సిన‌ అవ‌స‌రం లేదు, మీరు దానికి అర్హులా కాదా అన్న విష‌యం తెలుసుకోవాలి.

ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక‌:

జీవితం చివ‌రి ద‌శ‌లో ఎవ‌రిపై ఆధార‌ప‌డ‌కుండా ఉండేందుకు సొంతంగా ప్ర‌ణాళిక ఏర్పాటు చేసుకోవాలి. చిన్న‌వ‌య‌సులోనే పెట్టుబ‌డుల‌ను ప్రారంభించి, క్ర‌మంగా పెట్టుబ‌డుల‌ను కొనుసాగించాలి. రిక‌రింగ్ డిపాజిట్ల‌లో పొదుపు ప్రారంభించాలి. చిన్న వ‌య‌సులో అయితే దీర్ఘ‌కాలం ఈక్విటీల‌లో పెట్టుబ‌డులు చేసేందుకు ప్రోత్సహించాలి. ఒక‌వేళ భార్యాభ‌ర్త‌లు ఆదాయం పొందుతుంటే ప్ర‌ధాన‌మంత్రి శ్ర‌మ యోగి మంద‌న్ పెన్ష‌న్ యోజ‌న (పీఎం-ఎస్‌వైఎం) తీసుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు భార్య‌కు 40 నంచి 60 సంవ‌త్స‌రాల వ‌య‌సులో నెల‌కు రూ.200 చెల్లిస్తే, 60 ఏళ్ల త‌ర్వాత ప్ర‌తి నెల రూ.3 వేలు పెన్ష‌న్ రూపంలో పొంద‌వ‌చ్చు. తెలియ‌ని వారికి ఈ విష‌యాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించి సాయ‌ప‌డొచ్చు. దీంతో వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవ‌నం కొన‌సాగిస్తాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని