close

Updated : 22/04/2021 14:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అండర్‌ 30 జాబితాలో ఇద్దరు హైదరాబాదీలు 

ఈనాడు, హైదరాబాద్‌:  ‘ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30’ జాబితాలో ఇద్దరు యువ హైదరాబాదీలు స్థానం సంపాదించారు. తాజాగా విడుదలైన ఈ జాబితాలో మేకర్స్‌ హైవ్‌ఇన్నోవేషన్స్‌ సీఈఓ ప్రణవ్‌ వెంపటి, డిజి-ప్రెక్స్‌ వ్యవస్థాపకుడు సమర్థ్‌ సింధీ ఉన్నారు.ప్రణవ్‌ వెంపటికి చెందిన హైవ్‌ఇన్నోవేషన్స్‌ కృత్రిమ అవయవాల తయారీలో నిమగ్నమైన సంస్థ. ఈ అంకుర సంస్థ ‘కల్‌ఆర్మ్‌’ అనే పేరుతో బయోనిక్‌ హ్యాండ్‌ తయారు చేసి, ఎంతో తక్కువ ధరకు అందిస్తోంది. ఈ కృత్రిమ చేత్తో టైపింగ్‌ సహా అన్ని రకాల పనులు చేయొచ్చు! స్టార్‌ఫిష్‌ గ్రోత్‌ పార్టనర్స్‌తో పాటు మరికొన్ని పెట్టుబడి సంస్థల నుంచి హైవ్‌ఇన్నోవేషన్స్‌ కొద్దికాలం క్రితం 9 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.65 కోట్లు) సమీకరించింది.

డిజి-ప్రెక్స్‌ ఆన్‌లైన్‌ ఫార్మసీ సేవల సంస్థ. డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ను వాట్సాప్‌లో పంపి, నెలకు సరిపడా మందులకు డబ్బు చెల్లిస్తే, ఉచితంగా డెలివరీ చేస్తుంది. ఈ సంస్థ రెండేళ్ల క్రితం ఖోస్లా వెంచర్స్, వై కాంబినేటర్, జస్టిన్‌ మతీన్‌ నుంచి 5.5 (దాదాపు రూ.40 కోట్లు) బిలియన్‌ డాలర్ల నిధులు సమీకరించింది. అ అంకుర సంస్థ వ్యవస్థాపకుడైన సమర్థ్‌ సింధీ బ్రౌన్‌ యూనివర్సిటీ నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పట్టా పుచ్చుకున్నారు. యూఎస్‌లోని ఒక హెల్త్‌కేర్‌ కంపెనీలో కొంతకాలం పనిచేసి వెనక్కి వచ్చారు.  

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని