Hyundai Alcazar: అల్కజార్‌ బుకింగ్స్‌ మొదలు..! - Hyundai Alcazar Bookings Open In India
close

Published : 09/06/2021 21:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Hyundai Alcazar: అల్కజార్‌ బుకింగ్స్‌ మొదలు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: హ్యూందాయ్‌కు చెందిన సరికొత్త ఎస్‌యూవీ అల్కజార్‌ భారత మార్కెట్లో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ముందస్తు బుకింగ్స్‌ స్వీకరణను మొదలుపెట్టారు. దీనికి టోకెన్‌ మొత్తం కింద రూ.25,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ కారు 6,7 సీట్ల మోడల్లోఅందుబాటులో కి రానుంది. దీనిని బుకింగ్స్‌ను షోరూమ్‌తోపాటు హ్యూందాయ్‌కి చెందిన ‘క్లిక్‌ టు బై’ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో పెట్టారు. ఈ కారు విడుదల తేదీని మాత్రం హ్యూందాయ్‌ ఇంకా ప్రకటించలేదు. వచ్చే నెలలో విడుదల చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది.  

కంపెనీ విక్రయాలు,సర్వీసులు, మార్కెటింగ్‌ విభాగ డైరెక్టర్‌ తరుణ్‌ గర్గ్‌ మాట్లాడుతూ ‘‘మా వినియోగదారులు హ్యూందాయ్‌ ఎస్‌యూవీ అనుభవాలు పొందడానికి క్రెటా, వెన్యూ, టక్సన్‌, కోనా ఎలక్ట్రిక్‌లను ఎంచుకొంటారు. ఫలితంగా భారత్‌లో అత్యధిక ఎస్‌యూవీలు విక్రయిస్తున్న సంస్థగా హ్యూందాయ్‌ అవతరించింది. నేడు అల్కజార్‌ బుకింగ్స్‌ను ప్రారంభిస్తున్నాం. ఈ కారు వినియోగదారులకు మంచి అనుభవాన్ని అందిస్తుంది’’ అని పేర్కొన్నారు. 

అల్కజార్‌ ఎస్‌యూవీ డిజైన్‌ కొంచె క్రెటాను పోలి ఉంటుంది. కాకపోతే, కాస్కేడింగ్‌ గ్రిల్, కొత్త స్టైల్‌లో ఎల్‌ఈడీ ల్యాంప్‌లు అమర్చారు.  ఈ కారులో బ్లూలింక్‌ టెక్నాలజీ స్మార్ట్‌ ఫీచర్‌ను  అమర్చారు. 10.25 ఇన్ఫోటైన్‌మెంట్‌ డిస్ప్లే,బోస్‌ సౌండ్‌ సిస్టమ్‌, ఎయిర్‌ ప్యూరిఫైయార్‌, రెండో వరుస సీట్లకు రిట్రాక్టబుల్‌ టేబుల్‌,వాయిస్‌ ఎనేబుల్‌ స్మార్ట్‌ సన్‌రూఫ్‌, మల్టీమోడ్‌ డ్రైవ్‌, ట్రాన్సాక్షన్‌ కంట్రోల్‌ మోడ్‌ వంటి ఆకర్షణలు ఉన్నాయి. ఈ కారు పెట్రోల్‌ రెండు పెట్రోల్‌ ఇంజిన్లలో లభిస్తుంది. 2.0 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ మోడల్‌ 157 బీహెచ్‌పీ శక్తిని, 191 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. పెట్రోల్‌ మోడల్‌కు 1.5లీటర్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 113 బీహెచ్‌పీ శక్తిని, 250 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనికి సిక్స్‌స్పీడ్‌ మాన్యూవల్‌, సిక్స్‌స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌లను అమర్చారు.  

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని