Hyundai Alcazar: మార్కెట్లోకి అల్కజార్‌ - Hyundai Alcazar SUV Launched In India
close

Updated : 18/06/2021 14:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Hyundai Alcazar: మార్కెట్లోకి అల్కజార్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: హ్యూందాయ్‌ ఇండియా మార్కెట్లోకి సరికొత్త ఎస్‌యూవీని తీసుకొచ్చింది. అల్కజార్‌ పేరుతో విడుదలైన ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.16.3 లక్షలు కాగా.. టాప్‌ వేరియంట్‌ ఎక్స్‌షోరూం ధర రూ.20 లక్షలు. ఈ ఎస్‌యూవీ ప్రెస్టిజ్‌, ప్రీమియం, సిగ్నేచర్‌ అనే మూడు ట్రిమ్స్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రతి ట్రిమ్‌లో ఆటోమేటిక్‌ గేర్‌ను ఆప్షనల్‌గా ఇచ్చారు. ఈ కారు మార్కెట్లో ఎంజీ హెక్టార్‌ ప్లస్‌, టాటా సఫారీ, మహీంద్రా విడుదల చేయబోయే ఎక్స్‌యూవీ 700 వంటి కార్లకు పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. మూడు ట్రిమ్‌ల్లో లభించే ఈ కారులో ఫీచర్లను బట్టి 12 వేరియంట్లు ఉన్నాయి.

ఈ కారు 4500 ఎం.ఎం. పొడవు, 1790 ఎం.ఎం. వెడల్పు ఉంది. దీని వీల్‌బేస్‌ 2760 ఎం.ఎం.గా కంపెనీ పేర్కొంది. ఇక ఈ కారు పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్లలో లభిస్తుంది. 2.0లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ 157 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేయగా.. 1.5లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ 113 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. రెండు ఇంజిన్లకు 6స్పీడ్‌ మాన్యువల్‌, 6 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌లను అందిస్తోంది. ఈ కారు పెట్రోల్‌ ఇంజిన్‌ లీటర్‌కు 14.5 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. డీజిల్‌ మోడల్‌ లీటర్‌కు 20.4 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుంది. ఆటోమేటిక్‌ వేరియంట్లకు మైలేజీ స్వల్పంగా తగ్గుతుంది.

కాస్కేడింగ్‌ గ్రిల్, కొత్త స్టైల్‌లో ఎల్‌ఈడీ ల్యాంప్‌లు అమర్చారు.  ఈ కారులో బ్లూలింక్‌ టెక్నాలజీ స్మార్ట్‌ ఫీచర్‌ను  పొందుపర్చారు. 10.25 ఇన్ఫోటైన్‌మెంట్‌ డిస్ప్లే, బోస్‌ సౌండ్‌ సిస్టమ్‌, ఎయిర్‌ ప్యూరిఫైయార్‌, రెండో వరుస సీట్లకు రిట్రాక్టబుల్‌ టేబుల్‌,వాయిస్‌ ఎనేబుల్‌ స్మార్ట్‌ సన్‌రూఫ్‌, మల్టీమోడ్‌ డ్రైవ్‌, ట్రాన్జాక్షన్‌ కంట్రోల్‌ మోడ్‌ వంటి ఆకర్షణలు ఉన్నాయి. ఇది ఆరు,ఏడు సీట్ల రకాల్లో లభిస్తుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని