హ్యుందాయ్‌ కొత్త మెయింటెనెన్స్‌ ప్రోగ్రాం - Hyundai launches new car maintenance programme for customers
close

Published : 23/02/2021 12:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హ్యుందాయ్‌ కొత్త మెయింటెనెన్స్‌ ప్రోగ్రాం

దిల్లీ: హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా(హెచ్‌ఎమ్‌ఐఎల్‌) తన వినియోగదార్ల కోసం సరికొత్త నిర్వహణ పథకం(మెయింటెనెన్స్‌ ప్రోగ్రామ్‌)ను తీసుకొచ్చింది. తొమ్మిది మోడళ్లలో బ్రేకులు, క్లచ్‌ల వంటి విడిభాగాలను మార్చుకోడానికి ఇది వీలుకల్పిస్తుంది. ఈ పథకం కింద తమ వినియోగదార్లు కారు కొన్న తొలి అయిదేళ్లలో వైపర్లు, బల్బులు, హోస్‌ బెల్టుల వంటి 14 భాగాలను రీప్లేస్‌ చేసుకోవచ్చని పేర్కొంది. ‘మా వినియోగదార్లను జీవితకాల భాగస్వాములుగా చేసుకోవడం కోసం హ్యుందాయ్‌ షీల్డ్‌ ఆఫ్‌ ట్రస్ట్‌ను ప్రవేశపెట్టామ’ని హెచ్‌ఎమ్‌ఐఎల్‌ డైరెక్టర్‌(విక్రయాలు, మార్కెటింగ్, సేవలు) తరుణ్‌ గార్గ్‌ పేర్కొన్నారు. ఈ ప్యాకేజీని కారు కొనుగోలు సమయంలో లేదా తొలి ఉచిత సర్వీసు కంటే ముందు తీసుకోవచ్చని వివరించారు.

ఇవీ చదవండి...

డ్రైవర్‌తో సహా అద్దెకు బైక్‌!

6 ఎయిర్‌బ్యాగ్‌లతో టాటా సఫారీ..ధర ఎంతంటే?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని