ఈ నెలాఖర్లో ఐఏటీఏ ‘ట్రావెల్‌ పాస్‌’ - IATA Travel Pass this month
close

Published : 02/03/2021 01:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ నెలాఖర్లో ఐఏటీఏ ‘ట్రావెల్‌ పాస్‌’

 ఇక సులువుగా విమాన ప్రయాణాలు
 భారత్‌తోనూ చర్చలు

దిల్లీ: కరోనా నేపథ్యంలో విమాన ప్రయాణాలను సులభతరం చేసేందుకు మార్చి చివరకల్లా ‘ట్రావెల్‌ పాస్‌’ తీసుకు రావాలని అంర్జాతీయ విమాన రవాణా సంఘం(ఐఏటీఏ) భావిస్తోంది. భారత్‌లోనూ దీనిని వినియోగించుకోవడానికి భారత అధికారులు, విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఐఏటీఏలో ఎయిరిండియా, విస్తారా, ఇండిగో, స్పైస్‌జెట్‌తో పాటు అంతర్జాతీయంగా 290 విమాన సంస్థలు సభ్యులుగా ఉన్నాయి.
ఏమిటీ ట్రావెల్‌ పాస్‌: ఇది ఒక మొబైల్‌ యాప్‌. కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ల విషయంలో ఆయా ప్రభుత్వాల నిబంధనలను పరిశీలించకుని, అందుకనుగుణంగా తమ ప్రయాణం సులువుగా నిర్వహించుకునేందుకు ఈ యాప్‌ ప్రయాణికులకు సహాయం చేస్తుంది. కరోనా సమయంలో వివిధ దేశాలకు ఒక అంతర్జాతీయ, ప్రామాణికీకరణ పరిష్కారం ఉండాల్సిన అవసరం ఉందని ఐఏటీఏ పేర్కొంది. ఈ పాస్‌ ద్వారా ప్రస్తుతం కాగితం ద్వారా జరుగుతున్న ప్రక్రియలన్నీ డిజిటల్‌ ప్లాట్‌ఫాంలోకి వెళతాయని తెలిపింది. మోసపూరిత పత్రాలకూ ఆస్కారం ఉండదని వివరించింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని