ICICI Bank Q2 Results: ఐసీఐసీఐ బ్యాంకు లాభంలో 25% వృద్ధి - ICICI Bank Q2 profit up 25 pc
close

Published : 23/10/2021 22:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ICICI Bank Q2 Results: ఐసీఐసీఐ బ్యాంకు లాభంలో 25% వృద్ధి

ముంబయి: సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ నికర లాభం 25% పెరిగి రూ.6,092 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు లాభాలు రూ.4,882 కోట్లుగా నమోదయ్యాయి. స్టాండలోన్‌ పద్ధతిన బ్యాంకు నికర లాభం 30% ఎగబాకి రూ.5,511 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇవి రూ.4,251 కోట్లుగా ఉన్నాయి. ఇక గత సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.39,289.60 కోట్లుగా ఉన్న ఆదాయం ఈసారి రూ.39,289.60 కోట్లకు చేరింది. ఏడాది కిందట స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏలు) 5.17 శాతంగా నమోదు కాగా.. ఈ సారి 4.82 శాతానికి తగ్గాయి. ఇక బ్యాంకు మొత్తం రుణాల్లో నికర నిరర్ధక ఆస్తులు 1 శాతం నుంచి 0.99 శాతానికి చేరాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని