ఎస్‌బీఐ బాటలో ఐసీఐసీఐ.. వడ్డీరేటు తగ్గింపు - ICICI Bank cuts home loan rate to 6.70 per cent
close

Updated : 05/03/2021 19:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎస్‌బీఐ బాటలో ఐసీఐసీఐ.. వడ్డీరేటు తగ్గింపు

ముంబయి: ప్రైవేటు రంగ అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ సైతం గృహ రుణాలు తీసుకోవాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌ చెప్పింది. గృహ రుణాలపై వడ్డీరేటును 6.70 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 31 వరకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని పేర్కొంది.

ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ గృహ రుణాలపై వడ్డీ రేటును 6.70 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కూడా వడ్డీ రేటును 6.65 శాతానికి తగ్గించింది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ సైతం వడ్డీరేటు తగ్గింపును ప్రకటించింది. సవరించిన వడ్డీ రేట్లు మార్చి 5 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. రూ.75 లక్షల వరకు రుణాలపై 6.70 శాతం; ఆపై మొత్తాలకు 6.75 శాతం వడ్డీరేటు వర్తిస్తుందని ఐసీఐసీఐ తెలిపింది.

ఇవీ చదవండి..
గృహ రుణాలపై ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌
ఆదాయపు పన్ను.. చేయొద్దు పొరపాట్లు..


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని