హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్‌ - ICICI Bank followed by HDFC Bank
close

Published : 04/08/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్‌

ఆర్థిక సేవల సంస్థల్లో మార్కెట్‌ విలువపరంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ రెండో స్థానానికి చేరింది. హెచ్‌డీఎఫ్‌సీని వెనక్కి నెట్టి ఈ స్థానాన్ని దక్కించుకుంది. రూ.7.94 లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈ విభాగంలో మొదటిస్థానంలో నిలవగా,  రూ.4.78 లక్షల కోట్లతో ఐసీఐసీఐ బ్యాంక్‌ రెండోస్థానానికి చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్‌ విలువ రూ.4.61 లక్షల కోట్లుగా నమోదైంది.


నిధులు.. సెంటిమెంట్‌.. సానుకూల ఫలితాలు..
త్రివేణీ సంగమ ఫలితమే

‘దేశీయ మదుపరుల నుంచే కాకుండా.. విదేశీ పెట్టుబడులూ స్టాక్‌మార్కెట్‌లోకి పెద్ద ఎత్తున వస్తుండటం గమనిస్తున్నాం. ఆర్థిక వృద్ధికి సంబంధించిన సమాచారం సానుకూలంగా ఉండటంతో మదుపరుల సెంటిమెంట్‌ బలపడుతోంది. కార్పొరేట్‌ ఫలితాలూ ఆశించిన దానికన్నా మెరుగ్గా వస్తున్నాయి. ఈ ‘త్రివేణి సంగమం’ వల్లే నిఫ్టీ 16,000 స్థాయిని దాటింది. ఇది ఇలాగే కొనసాగుతుందా అనే సందేహం అవసరం లేదు. నిఫ్టీ తొలుత 5,000 స్థాయిని దాటింది. ఆ తర్వాత 10వేలు. ఇప్పుడు 15,000 దాటి 16,000 పాయింట్లలోకి అడుగుపెట్టింది. ఈ స్థాయినీ అధిగమిస్తుంది. రానున్న రోజుల్లో టెక్నాలజీ కంపెనీలు మార్కెట్‌ను నడిపిస్తే, ఇతర కంపెనీలు తోడుగా నడుస్తాయి. కాస్త నెమ్మదించిన ఆర్థిక సేవల రంగమూ పుంజుకుంటుంది. వాహన రంగం, ఎన్‌బీఎఫ్‌సీలపై ఒత్తిడి కొనసాగుతోంది. సాధారణ బీమా సంస్థలూ ఇబ్బంది పడుతున్నాయి. ప్రైవేటు బ్యాంకులు, కొన్ని ప్రభుత్వ బ్యాంకుల పనితీరు బాగుంటుందని భావిస్తున్నాం. కొన్ని ఫిన్‌టెక్‌ సంస్థలు ఐపీఓల కోసం వస్తున్నాయి. వాటికి స్పందన బాగుంటే.. సాంకేతిక ఆధారంగా ఆర్థిక సేవలను అందించే సంస్థలకూ రేటింగ్‌లు మారే అవకాశం ఉంది.’

- నీలేశ్‌ షా, మేనేజింగ్‌ డైరెక్టర్‌, కోటక్‌ ఏఎంసీ


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని