ఉద్యోగుల వ్యాక్సినేషన్‌ ఖర్చు మాదే: ఐసీఐసీఐ - ICICI Bank to bear cost of COVID-19 vaccination for employees
close

Published : 10/03/2021 17:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉద్యోగుల వ్యాక్సినేషన్‌ ఖర్చు మాదే: ఐసీఐసీఐ

దిల్లీ: ఉద్యోగుల వ్యాక్సినేషన్‌ ఖర్చును తామే భరించనున్నామని ప్రైవేటు రంగ బ్యాంక్‌ ఐసీఐసీఐ ప్రకటించింది. సుమారు లక్ష మంది వరకు ఉండే ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల వ్యాక్సిన్‌ ఖర్చును భరించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఉద్యోగులు, వారిపై ఆధారపడే కుటుంబ సభ్యుల రక్షణార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

కొవిడ్‌ నుంచి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన రెండు టీకాల ఖర్చు మొత్తాన్ని తాము ఉద్యోగులకు రీయింబర్స్‌ చేయనున్నట్లు ఐసీఐసీఐ తెలిపింది. కరోనా మహమ్మారి వేళ లక్షల మంది వినియోగదారులకు తమ ఉద్యోగులు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సేవలందించారని పేర్కొంది. అలాంటి ఉద్యోగులను, వారి కుటుంబ సభ్యులను కాపాడుకోవడం తమ బాధ్యతగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఐసీఐసీఐ గ్రూప్‌ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ అధికారి టీకే శ్రీరంగ్‌ తెలిపారు. ఇప్పటికే పలు కార్పొరేట్‌ కంపెనీలు తమ ఉద్యోగులకు వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి..

క్రెడిట్ కార్డు వల్ల కలిగే లాభన‌ష్టాలు

టీవీఎస్‌ కొత్త అపాచీ.. ధర ఎంతంటే?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని