ICICI Bank Alert: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు గమనిక! - ICICI-Banks-service-charges-to-change-from-next-week
close

Updated : 28/07/2021 14:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ICICI Bank Alert: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు గమనిక!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీఐసీఐ స‌ర్వీస్ ఛార్జీలు ఆగ‌స్టు 1 నుండి మార‌నున్నాయి. బ్యాంకు వెబ్‌సైట్ ప్రకారం ఐసీఐసీఐ వినియోగ‌దారుల‌కు 6 మెట్రో న‌గ‌రాల్లో మొద‌టి 3 లావాదేవీల (ఆర్థిక, ఆర్థికేత‌ర) సేవ‌లు ఉచితంగా ల‌భిస్తాయి. ఐసీఐసీఐ బ్యాంకు న‌గ‌దు లావాదేవీ, ఏటీఎం ఇంట‌ర్‌ఛేంజ్‌, చెక్‌బుక్ ఛార్జీలు ఆగ‌స్టు 1 నుండి మార‌తాయి.

సవరించిన ఛార్జీల వివ‌రాలు...

* ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలో నెల‌కు మొత్తం 4 ఉచిత న‌గ‌దు లావాదేవీల‌ను అనుమ‌తించింది. ప్రతి అదనపు లావాదేవీకి రుసుము వసూలు చేస్తారు.

ఐసీఐసీఐ వినియోగ‌దారుల‌కు 6 మెట్రో న‌గ‌రాల్లో మొద‌టి 3 లావాదేవీల (ఆర్థిక, ఆర్థికేత‌ర) సేవ‌లు ఉచితంగా ల‌భిస్తాయి.

మెట్రో న‌గ‌రాలు కాకుండా అన్నిఇత‌ర ప్ర‌దేశాల‌లో, మొద‌టి 5 లావాదేవీలు ఉచితం.

బ్యాంకు ప్ర‌తి ఆర్థిక లావాదేవీకి రూ. 20, ఆర్థికేత‌ర లావాదేవీకి రూ. 8.50 వ‌సూలు చేస్తుంది.

హోం బ్రాంచిలో న‌గ‌దు లావాదేవీ ప‌రిమితి నెలకు రూ.1 ల‌క్ష వరకు ఉచితం. అది దాటితే ప్రతి రూ.1000కి రూ.5 ఛార్జీ ప‌డుతుంది. క‌నిష్ఠంగా రూ.150కు లోబ‌డి ఉంటుంద‌ని బ్యాంక్ తెలిపింది.

నాన్ హోమ్ బ్రాంచ్ వ‌ద్ద రోజుకు రూ. 25,000 వ‌ర‌కు న‌గ‌దు లావాదేవీల‌కు ఛార్జీలు లేవు. రూ. 25,000 పైన రూ.1000కి రూ.5 ఛార్జీ ప‌డుతుంది. క‌నీసం రూ. 150కి లోబ‌డి ఉంటుంది.

థ‌ర్డ్‌ పార్టీ లావాదేవీల ప‌రిమితి రోజుకు రూ. 25,000గా నిర్ణ‌యించారు. రూ. 25,000 ప‌రిమితి వ‌ర‌కు ప్ర‌తి లావాదేవీకి రూ.150 ఛార్జీ ఉంటుంది. రూ. 25,000 ప‌రిమితికి మించి న‌గ‌దు లావాదేవీలు అనుమ‌తి లేదు.

ఒక నెల‌లో మొద‌టి 4 లావాదేవీల‌కు  ఛార్జీలుండ‌వు. ఆ త‌ర్వాత రూ.1000 లావాదేవీకి రూ. 5 ఛార్జీ, క‌నీసం రూ.150కి లోబ‌డి ఉంటుంది.

ఒక సంవ‌త్స‌రంలో తీసుకున్న 25 చెక్‌లున్న చెక్ బుక్‌కి ఛార్జీలు లేవు. ఆ త‌ర్వాత అదే సంవ‌త్స‌రంలో 10 చెక్‌లున్న చెక్ బుక్ తీసుకుంటే బ్యాంక్ రూ. 20 వ‌సూలు చేస్తుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని