ఎంపికచేసిన కొంత మంది వినియోగదారులకు `ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్` క్రెడిట్ కార్డ్ మీద నగదు ఉపసంహరణ వడ్డీ రేట్లను 9%కు ఇవ్వాలని యోచిస్తోంది.
క్రెడిట్ కార్డుల నుండి నగదు ఉపసంహరణపై అధిక వడ్డీలను వసూలు చేసే విషయంపై దూరంగా ఉండాలని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ భావిస్తోంది. మంచి క్రెడిట్ రిపోర్ట్ ఉన్న కస్టమర్లకు ఇప్పటినుండి కార్డు నగదు ఉపసంహరణలపై తక్కువ వడ్డీ రేటు చెల్లించే అవకాశముందని భావించవచ్చు.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ వ్యాపారాన్ని ప్రారంభించింది. వినియోగదారులపై వడ్డీ రేట్లను 9% కంటే తక్కువ వసూలు చేయాలని యోచిస్తోంది. అయితే కస్టమర్ యొక్క క్రెడిట్ ప్రోఫైల్‌ను బట్టి, వార్షిక శాత వడ్డీ రేటు మారుతుంది. 36% వరకు కూడా ఉంటుంది.
క్రెడిట్ కార్డ్ మార్కెట్లో ఆలస్యంగా ప్రవేశించినందున ఇతరులకు భిన్నంగా డైనమిక్ వడ్డీ రేట్లతో సంక్లిష్టమైన స్కోరింగ్ విధానాన్ని బ్యాంక్ అభివృద్ధి చేసింది. కస్టమర్ ప్రొఫైల్స్‌ను అంచనా వేయడానికి, స్కోర్ల ఆధారంగా వడ్డీ రేట్లను అందించడానికి బ్యాంక్ యాజమాన్య స్కోరింగ్ విధానాన్ని రూపొందించింది. కస్టమర్ల స్కోర్లను బట్టి వడ్డీ రేటు నిర్ణయించబడుతుందని బ్యాంక్ ప్రతినిధి తెలిపారు.
బ్యాంక్ మొదట తన వినియోగదారులకు క్రెడిట్ కార్డులను అందిస్తుంది. ఈ ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇప్పటికే ఉన్న బ్యాంక్ వినియోగదారుల నుండి ధరఖాస్తులను స్వీకరిస్తుంది. ప్రస్తుత బ్యాంక్ వినియోగదారులు కానివారు ఏప్రిల్ నుండి ధరఖాస్తు చేసుకోవచ్చు.
క్రెడిట్ కార్డుల నుండి నగదు ఉపసంహరణపై అధిక ఛార్జీలు విధించే పద్ధతి నుండి దూరంగా ఉండాలని బ్యాంక్ భావిస్తోంది. చాలా బ్యాంకులు ఇలా నగదు ఉపసంహరణపై మొదటి రోజు నుండే వడ్డీ రేట్లు, ఛార్జీలు వసూలు చేస్తారు. కాని ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ మొదట రూ. 250 ఫ్లాట్ ఫీజు వసూలు చేస్తుంది. నగదు ఉపసంహరణపై 48 రోజుల వడ్డీ లేని వ్యవధిని అందిస్తుంది.
9% వార్షిక వడ్డీ చాలా వరకు ఐడీఎప్సీ ఫస్ట్ బ్యాంక్ యొక్క ప్రస్తుత కస్టమర్ కోసం ఉంటుంది. కొంతకాలంగా బ్యాంకింగ్ చేస్తున్న ప్రస్తుత కస్టమర్ యొక్క క్రెడిట్ ప్రొఫైల్‌ను అంచనా వేయడం బ్యాంకుకు చాలా సులభం. బ్యాంకు కస్టమర్లు కానీ వారికి వార్షిక వడ్డీ ఎక్కువే ఉంటుంది. ఇతర బ్యాంకులు ఐడీఎఫ్సీ బ్యాంక్‌ను అనుసరించవచ్చని, ఇక్కడ నుండి మంచి క్రెడిట్ ప్రొఫైల్ ఉన్న కస్టమర్లు తక్కువ వడ్డీ రేటునే చెల్లిస్తారని బ్యాంక్ ప్రతినిధి తెలిపారు.
క్రెడిట్ కార్డ్ బకాయిలపై బ్యాంకులు వసూలు చేసే అధిక వడ్డీ రేట్లు ఇంతకుముందు ఉన్న వ్యాపారంలో అధిక డిఫాల్ట్స్ కారణంగా చాలా ఎక్కువ ఉండేవి. ఇతర రుణాలతో పోలిస్తే క్రెడిట్ కార్డ్ రుణాలు చాలా ప్రమాదకరంగా ఉండేవి. ఒక దశాబ్దం క్రితం క్రెడిట్ కార్డ్ వ్యాపారంలో 6% నిరర్ధక ఆస్తులు చాలా సాధారణంగా ఉండేవి. కానీ ఇపుడు 2% ఉంటున్నాయి. క్రెడిట్ బ్యూరోలు పెరిగినందున డిఫాల్ట్స్, మోసాలు తగ్గాయి. మెరుగైన క్రెడిట్ స్కోర్ కోసం ఇపుడు కస్టమర్లు రుణాలు తీసుకోవడం, చెల్లించడంలో ఖచ్చితత్వం పాటిస్తున్నారు.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌కు ముందు, `ఎస్` బ్యాంక్ తన `ఎస్ ఫస్ట్ ఎక్స్‌క్లూజివ్ క్రెడిట్ కార్డు`పై 12-15% వడ్డీ రేట్లను వసూలు చేసింది.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?