IFSC code: సిండికేట్‌ బ్యాంక్‌లో ఖాతా ఉందా? - IFSC codes of erstwhile Syndicate bank branches to change from July 1
close

Updated : 11/06/2021 20:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IFSC code: సిండికేట్‌ బ్యాంక్‌లో ఖాతా ఉందా?

బెంగళూరు: సిండికేట్‌ బ్యాంక్‌ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు జులై 1 నుంచి మారనున్నాయి. నెఫ్ట్‌/ఆర్టీజీఎస్‌/ఐఎంపీఎస్‌ మార్గాల ద్వారా నగదు లావాదేవీలకు ఇకపై కెనరా బ్యాంక్‌ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా సిండికేట్‌ బ్యాంక్‌.. కెనరా బ్యాంక్‌లో విలీనం అయిన సంగతి తెలిసిందే. దీంతో కెనరా బ్యాంక్‌ నాలుగో అతిపెద్ద బ్యాంక్‌గా అవతరించింది.

కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను పొందేందుకు తమ బ్యాంక్‌ వెబ్‌సైట్‌ను గానీ (canarabank.com/IFSC.html), తమ బ్యాంక్‌ బ్రాంచ్‌ను గానీ ఖాతాదారులు సంప్రదించాలని కెనరా బ్యాంక్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే, సిండికేట్‌ బ్యాంక్‌ ఖాతాదారులు మారిన ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌, ఎంఐసీఆర్‌ కోడ్‌లతో కూడిన చెక్‌ బుక్‌లను తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. విదేశీ లావాదేవీలకు CNRBINBBFD స్విఫ్ట్‌ కోడ్‌ను వాడాల్సి ఉంటుందని, ఈ విషయాన్ని ఖాతాదారులు గమనించాలని కెనరా బ్యాంక్‌ పేర్కొంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని