పారిశ్రామికోత్పత్తి కళకళ  - IIP grows 1 pc in Dec retail inflation cools to 16 month low
close

Updated : 13/02/2021 10:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పారిశ్రామికోత్పత్తి కళకళ 

డిసెంబరులో 1% వృద్ధి 

దిల్లీ:  తయారీ రంగం రాణించడంతో డిసెంబరులో పారిశ్రామికోత్పత్తి 1 శాతం మేర పెరిగింది. పారిశ్రామికోత్పత్తి వృద్ధిని పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారంగా లెక్కిస్తారు. 2019 డిసెంబరులో ఇది 0.4 శాతంగా ఉంది. ఐఐపీలో 77.63 శాతం వాటా ఉన్న తయారీ రంగం వృద్ధి డిసెంబరులో 1.6 శాతంగా నమోదైంది. 2019లో ఇదే నెలలో తయారీ రంగం ఉత్పత్తి 0.3 శాతం క్షీణించింది.

జనవరిలో 16 నెలల కనిష్ఠానికి ద్రవ్యోల్బణం

ఆహార పదార్థాలు, కూరగాయల ధరలు తగ్గడంతో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జనవరిలో 4.06 శాతంగా నమోదైంది. ఇది 16 నెలల కనిష్ఠస్థాయి. వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ) ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. 2020 డిసెంబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.59 శాతంగా ఉంది.

ఇవీ చదవండి...

బ్రిటన్‌లో అతిపెద్ద మాంద్యం

ప్రై‘వేటు’పై విమర్శలొస్తున్నా పట్టుదల ఎందుకు?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని