IMF: భారత్‌ వృద్ధిరేటు అంచనా తగ్గింపు! - IMF Downgrades Indias Growth Projection
close

Published : 27/07/2021 22:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IMF: భారత్‌ వృద్ధిరేటు అంచనా తగ్గింపు!

దిల్లీ: భారతదేశ వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) తగ్గించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 12.5 శాతం నుంచి 9.5శాతానికి తగ్గించింది. 2022-23 సంవత్సరంలో  వృద్ధిరేటు 8.5శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. అలాగే,  ప్రపంచ వృద్ధిరేటు 6శాతంగా ఉండొచ్చని ఐఎంఎఫ్‌ పేర్కొంది. మార్చి- మే నెలల్లో  కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర ప్రభావం చూపించిన నేపథ్యంలో దేశంలో వృద్ధి అవకాశాలు మందగించాయని, ఆ దెబ్బనుంచి నెమ్మదిగా కోలుకుంటోందని వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌లో తాజాగా ఐఎంఎఫ్‌ విశ్వాసం వ్యక్తంచేసింది.



మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని