close

Published : 26/02/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐపీఓలు.. దుమ్మురేపాయ్‌

2020-21లో అన్నీ రాణించాయ్‌
స్పందనతో పాటు నమోదులోనూ జోరు

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన పబ్లిక్‌ ఇష్యూ(ఐపీఓ)లన్నీ కరోనాకు తట్టుకుని నిలబడే రంగాల నుంచే వచ్చాయని సెబీ ఛైర్మన్‌ అజయ్‌ త్యాగి పేర్కొన్నారు. ‘2021 జనవరి వరకు మొత్తం 18 ఐపీఓలు వచ్చాయి. దాదాపు ఇవన్నీ కూడా టెక్నాలజీ, స్పెషాలిటీ కెమికల్స్‌, ఆరోగ్యసంరక్షణ, కొన్ని ఆర్థిక ఉప రంగాలకు చెందినవే’ అని సెబీ-ఎన్‌ఐఎస్‌ఎమ్‌ సదస్సులో ఆయన చెప్పారు. ‘కొన్ని మార్కెట్‌ దిగ్గజాలు కూడా ఐపీఓల ద్వారా నిధులు సమీకరించుకున్నాయి. ప్రతి ఇష్యూకు కనీసం రెట్టింపు దరఖాస్తులు వచ్చాయి. మూడోవంతు ఇష్యూలైతే 100 రెట్లకు పైగా సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. అయిదు ఇష్యూలకు 150 రెట్లకు పైగా బిడ్‌లు లభించాయి. 18 ఇష్యూల్లో 14 తమ ఇష్యూ ధర కంటే అధికంగానే నమోదయ్యాయి. మూడైతే 100 శాతానికి పైగా ప్రీమియంతో లిస్టయ్యాయి. గత నెలలో నమోదైన రెండు ఐపీఓలను మినహాయిస్తే.. మిగతా 16 ఐపీఓలన్నీ ఇష్యూ ధరతో పోలిస్తే పైనే కదలాడుతున్నాయి. ఇప్పటిదాకా కంపెనీలు ఈక్విటీ, బాండ్‌ మార్కెట్లలో కలిపి రూ.8.4 లక్షల కోట్లను సమీకరించాయి. ఏడాది క్రితం ఇదే సమయం కంటే ఈ మొత్తం రూ.40,000 కోట్లు ఎక్కువ. కార్పొరేట్‌ బాండ్ల ద్వారా గత ఆర్థిక సంవత్సరం సమీకరించిన నిధులతో పోలిస్తే ఈ ఏడాది జనవరి నాటికి సమీకరించినవి రెట్టింపుగా ఉన్నాయి. కరోనా వల్ల కార్పొరేట్ల ధోరణిలో ముఖ్యంగా నిధుల సమీకరణలోనూ మార్పు కనిపించింది’ అని త్యాగి వివరించారు.

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని