సరికొత్త ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రారంభించనున్న ఐఆర్డీఏఐ - IRDAI-to-launch-new-standard-travel-insurance-policy
close

Published : 30/12/2020 14:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సరికొత్త ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రారంభించనున్న ఐఆర్డీఏఐ

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) సోమవారం ఒక ప్రామాణిక ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రతిపాదించింది. దీనిని ఏప్రిల్ 1, 2021 నాటికి ప్రారంభించాలని ఐఆర్డీఏఐ భావిస్తుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ విక్రయాలను పెంచాలనే లక్ష్యంతో ఐఆర్డీఏఐ ఈ సరికొత్త పాలసీని తీసుకొచ్చింది. 

ఐఆర్డీఏఐ 2018-19 వార్షిక నివేదిక ప్రకారం, 2.58 మిలియన్ విదేశీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు, 11.4 మిలియన్ దేశీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు జారీ అయ్యాయి . ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు తక్కువగా అమ్ముడుపోవడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే, వివిధ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు వేర్వేరు ఫీచర్స్ ను కలిగి ఉండటం వలన వాటిని అర్థం చేసుకోవడం కష్టం. 2020 సంవత్సరంలో, ఆరోగ్య బీమా పాలసీ నుంచి టర్మ్ లైఫ్ కవర్, పర్సనల్ యాక్సిడెంట్ ప్లాన్ వరకు అనేక ప్రామాణిక బీమా కవర్లను ఐఆర్డీఏఐ ప్రారంభించింది.

ఆరోగ్య సంజీవని (ఆరోగ్య బీమా), సరల్ జీవన్ బీమా (టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్) పాలసీల మాదిరిగానే, ప్రామాణిక ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా అన్ని బీమా సంస్థలు అందించే ప్రాథమిక కవర్ ఉంటుందని పాలసీబజార్.కామ్ హెడ్, హెల్త్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ హెడ్ అమిత్ ఛబ్రా తెలిపారు. అన్ని బీమా సంస్థలు ఒకేవిధమైన ఫీచర్స్, ప్రయోజనాలు, చేరికలు, మినహాయింపులను కలిగి ఉంటాయి. అయితే బీమా మొత్తం, ప్రీమియం, సర్వీస్ లెవెల్స్, క్లెయిమ్ సెటిల్మెంట్ రేటు భిన్నంగా ఉండవచ్చు. భారతదేశంలో ట్రావెల్ ఇన్సూరెన్స్  అనేది అతి తక్కువ అమ్ముడుపోయే విభాగాలలో ఒకటి. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఐఆర్డీఏఐ చూసుకుంటుంది.  

18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. దేశీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద ఐదు రకాలు (ఉదాహరణకు ఎయిర్, రైలు ప్రయాణాలకు),  అలాగే విదేశీ ప్రయాణాలలో నాలుగు రకాలు (స్వల్పకాలిక పర్యటనలు, పాలసీ కాలంలో బహుళ-ప్రయాణాలు వంటివి) ఉన్నాయి.

ప్రామాణిక ఉత్పత్తిని కుటుంబ ఫ్లోటర్ ప్రాతిపదికన కూడా అందించాలి. పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా, విదేశీ ట్రావెల్ ఇన్సూరెన్స్ విషయంలో ప్రామాణిక ఉత్పత్తి కాలపరిమితి అనేది పాలసీదారుని ప్రయాణ వ్యవధి, వారు విదేశాలలో ఉండే సమయం ఆధారంగా ఉండాలి. ఈ ప్రోడక్ట్ కింద ప్రీమియం అనేది దేశం మొత్తం ఒకేవిధంగా ఉండాలి. విదేశీ కవరేజ్ ప్రీమియం అనేది ప్రయాణం, బస చేసిన దేశం లేదా ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని