కొత్త ఇ-ఫైల్లింగ్ పోర్ట‌ల్‌ను లాంచ్ చేయ‌నున్న ఐటి శాఖ‌  - IT-department-to-launch-new-e-filing-portal-for-taxpayers
close

Published : 20/05/2021 15:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త ఇ-ఫైల్లింగ్ పోర్ట‌ల్‌ను లాంచ్ చేయ‌నున్న ఐటి శాఖ‌ 

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల దాఖ‌లును సుల‌భ‌త‌రం చేసేందుకు కొత్త ఇ-ఫైల్లింగ్ పోర్ట‌ల్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారులు గురువారం తెలిపారు.  ఈ ఏడాది జూన్ 1 నుంచి 6వ తేది వ‌ర‌కు ప్ర‌స్తుతం ఉన్న వెబ్ పోర్టల్ ప‌నిచేయ‌ద‌ని, ప‌న్ను చెల్లింపుదారుల కోసం జూన్ 7వ తేది నాటికి కొత్త ఇ-ఫైల్లింగ్ పోర్ట‌ల్ అందుబాటులోకి తీసుకొస్తామ‌ని తెలిపారు. 

పాత పోర్టల్ .. www.incometaxindiaefiling.gov.in  నుంచి కొత్త పోర్టల్.. www.incometaxgov.in కు "పరివర్తన" పూర్తయిందని జూన్7 నుంచి కొత్త పోర్ట‌ల్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని సిస్ట‌మ్స్ విభాగం ఉత్త‌ర్వుల‌లో పేర్కొంది. జూన్ 1 నుంచి 6వ తేది వ‌ర‌కు కొత్త‌పోర్ట‌ల్‌తో పాటు పాత పోర్ట‌ల్ కూడా.. అటు ప‌న్నుచెల్లింపుదారుల‌కు, ఇటు ఆదాయ‌పు ప‌న్ను అధికారుల‌కు కూడా అందుబాటులో ఉండ‌ద‌ని తెలిపింది. అందువ‌ల్ల ముఖ్య‌మైన‌ తేదిల‌ను నిర్ణ‌యించ‌వ‌ద్ద‌ని తెలిపింది. 

పన్ను చెల్లింపుదారుల‌కు, డిపార్మెంట్‌ అసెస్సింగ్ ఆఫీసర్ మధ్య ఇప్ప‌టికే షెడ్యూల్ చేసిన ప‌నుల‌ను వాయిదా వేసే అవ‌కాశం ఉంది. ప‌న్ను చెల్లింపుదారులు కొత్త పోర్ట‌ల్‌కు అల‌వాటు ప‌డేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది కాబ‌ట్టి. జూన్ 10వ తేది త‌ర‌వాతకు వీటిని వాయిదా వేసుకోవాలని తెలిపింది. 

వ్య‌క్తిగ‌త లేదా బిజినెస్ కేట‌గిరికి సంబంధించి ప‌న్ను రిట‌ర్నుల‌ను(ఐటీర్‌)ను ఫైల్ చేసేందుకు, ప‌న్ను వాప‌సుల విష‌యంలో త‌లెత్తే స‌మస్య‌ల‌ను, ఆదాయ‌పు ప‌న్నుకు సంబంధించి ఇత‌ర ప‌నుల కోసం ప‌న్నుచెల్లింపుదారులు ఇ-ఫైల్లింగ్ పోర్ట‌ల్‌ను వినియోగిస్తుంటారు. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని