ఐటీ విక్రయాల్లో 5.2 శాతం వృద్ధి - IT sector sales up says RBI Report
close

Published : 06/03/2021 11:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐటీ విక్రయాల్లో 5.2 శాతం వృద్ధి

ఆర్‌బీఐ నివేదిక

ముంబయి: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికపు ఐటీ విక్రయాల్లో 5.2 శాతం వృద్ధి నమోదైనట్లు ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది. కరోనా సంక్షోభ కాలంలో ఐటీ రంగం సానుకూల ఫలితాల్ని నమోదు చేసినట్లు తెలిపింది. 165 ఐటీ కంపెనీల విక్రయాలు డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.1,05,724 కోట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఐటీ ఉత్పత్తుల అమ్మకాల విలువ రూ.1,01,001 కోట్లుగా ఉంది. ప్రైవేటు రంగంలోని 2,692 ఆర్థికేతర సంస్థల త్రైమాసిక ఫలితాల్ని పరిశీలించి ఆర్‌బీఐ ఈ నివేదిక రూపొందించింది.

ఇక కొవిడ్‌ కట్టడి సంబంధిత ఆంక్షలు ఎత్తివేయడంతో తయారీ రంగ కార్యకలాపాలు మూడో త్రైమాసికంలో భారీగా పుంజుకున్నట్లు నివేదిక పేర్కొంది. 1,685 తయారీ కంపెనీల విక్రయాలు 7.4 శాతం వృద్ధి చెందినట్లు తెలిపింది. అంతకుముందు వరుసగా ఆరు త్రైమాసికాల్లో ఈ రంగం విక్రయాల్లో క్షీణత నమోదైన విషయం తెలిసిందే. ఉక్కు, వాహన, సిమెంట్‌, రసాయన, ఔషధ రంగాల నుంచి మద్దతు లభించడం తయారీ రంగానికి ఊతమిచ్చింది. మరోవైపు విక్రయాలు పుంజుకుంటున్న నేపథ్యంలో కంపెనీలు ముడి సరకుల కొనుగోలుపై భారీగా వెచ్చిస్తున్నాయి.

మరోవైపు ఐటీయేతర సేవా రంగం విక్రయాల్లో క్షీణత తగ్గుముఖం పడుతోంది. రెండో త్రైమాసికంలో (-)14.5గా ఉన్న వృద్ధిరేటు మూడో త్రైమాసికానికి (-)5.7 శాతానికి తగ్గింది. టెలికమ్యూనికేషన్‌, స్థిరాస్తి రంగాల్లో నమోదైన వృద్ధే అందుకు కారణమని నివేదిక పేర్కొంది.

ఇవీ చదవండి...

టెక్‌ నియామకాలు అదిరాయ్‌

రూ.38 లక్షల కోట్ల తయారీ


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని