ITC: మళ్లీ రూ.3లక్షల కోట్ల మార్కుకు చేరిన ఐటీసీ..! - ITC regains Rs 3trillion market cap
close

Published : 22/09/2021 23:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ITC: మళ్లీ రూ.3లక్షల కోట్ల మార్కుకు చేరిన ఐటీసీ..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐటీసీ సంస్థ మార్కెట్‌ విలువ నేడు రూ.3 లక్షల కోట్ల మార్కుకు చేరింది. ఈ సంస్థే దేశంలో అత్యధికంగా సిగరెట్లు తయారు చేస్తుంది. అంతేకాదు ఎఫ్‌ఎంసీజీ వ్యాపారంలో రెండో అతిపెద్ద సంస్థ. దాదాపు 21 నెలల తర్వాత ఐటీసీ మళ్లీ ఈ స్థాయికి చేరింది. కంపెనీ షేరు నేడు 1శాతం పెరిగి రూ.244.70కు చేరింది. . గతనెలలో ఐటీసీ షేరు అద్భుతమైన పనితీరు చూపింది. కంపెనీ వ్యాపారం పెరుగుతుందనే అంచనాలతో 13శాతం విలువ పెరిగింది. అదే సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ కేవలం 0.62శాతం మాత్రమే వృద్ధి చెందింది. నేటి మధ్యాహ్నం 1.55 సమయంలో రూ.2.99 లక్షల కోట్లకు చేరింది. 

దేశంలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ వేగంగా జరుగుతుండటం కంపెనీకి కలిసివచ్చింది. సిగరెట్లు, ఎఫ్‌ఎంసీజీ వ్యాపారాలు మళ్లీ పాత స్థాయికి చేరతాయని నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ మధ్య కాలంలో కంపెనీ సిగరెట్‌ వ్యాపారం 21శాతం కుంగింది. దీంతోపాటు వచ్చే ఏడాది కంపెనీ సిగరెట్‌ రేట్లను పెంచే అవకాశం ఉందని ఆర్థిక సంస్థలు అంచనావేస్తున్నాయి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని