కేంద్ర పన్నుల్లో సెస్, సర్‌ఛార్జీ వాటా రెట్టింపు
ఇండియా రేటింగ్స్ నివేదిక
ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21)లో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయాల్లో సెస్సులు, సర్‌ఛార్జీల వాటా రెట్టింపైంది. 2011-12లో వీటి వాటా 10.4 శాతంగా ఉండగా.. తాజాగా 19.9 శాతానికి చేరిందని ఇండియా రేటింగ్స్ తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుత ఫైనాన్స్ కమిషన్(ఎఫ్‌సీ) విధానం కింద కేంద్రం వసూలు చేసే సెస్సులు, సర్ఛార్జీలను రాష్ట్రాలకు పంపిణీ చేయనక్కర్లేదు. అయితే రాష్ట్రాలకు పరిహారం కింద గ్రాంట్-ఇన్-ఎయిడ్‌లను పెంచాలని సూచించిన విషయం తెలిసిందే. మంగళవారం విడుదలైన ఇండియా రేటింగ్స్ నివేదిక ప్రకారం.నీ కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదిలీ అయ్యే ఆర్థికేతర కమీషన్లు 2019-20లో 48.6 శాతానికి పరిమితయ్యాయి. 2011-12లో ఇవి 53.4 శాతంగా ఉండేవి. కేంద్రం ఇంకా రాష్ట్రాలకు ఇచ్చే రూ.1.8 లక్షల కోట్ల గ్రాంట్ల ప్రతిపాదనలను అంగీకరించాల్సి ఉంది.
* తాజా ఎఫ్‌సీ ప్రకారం.. ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌కు 35 బేసిస్ పాయింట్లు తగ్గి 4.05 శాతానికి పరిమితం కాగా.. తెలంగాణకు 40 బేసిస్ పాయింట్లు తగ్గి 2.10 శాతానికి చేరింది. అసోం(24 బేసిస్ పాయింట్లు), కర్ణాటక(118), కేరళ(60)లు కూడా వాటా కోల్పోయాయి.
* మహారాష్ట్ర మాత్రం అత్యధికంగా 64 బేసిస్ పాయింట్ల మేర కేంద్ర పన్నుల్లో తన వాటా పెంచుకుంది. రాజస్థాన్(38 బేసిస్ పాయింట్లు), అరుణాచల్ ప్రదేశ్(33), గుజరాత్(31)లు కూడా పెంచుకోగలిగాయి.
* కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్స్-ఇన్-ఎయిడ్లలో తొలి అయిదు స్థానాల్లో ఉత్తరప్రదేశ్(16.3%), బిహార్(9.1%), బెంగాల్(7.7%), మధ్యప్రదేశ్(7.3%), మహారాష్ట్ర(6.4%) ఉన్నాయి.
* ఆంధ్రప్రదేశ్‌తో పాటు 16 రాష్ట్రాలకు 2025-26 వరకు రూ.2,94,514 కోట్ల మేర గ్రాంట్ల విషయంలో ఆదాయ లోటు ఉండబోతోంది.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడం ఎలా?
-
Q. హలో సర్, నేను 20 ఏళ్ళ పాటు మ్యూచువల్ ఫండ్స్ లో నెల నెలా రూ. 1500 మదుపు చేయాలనుకుంటున్నాను. మంచి ఫండ్స్ సూచించండి.
-
Q. నమస్తే సర్, నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిని. నెలసరి జీతం రూ. 12 వేలలో రూ. 7800 ఖర్చులు పోనీ మిగతా మొత్తని పొదుపు చేయాలనుకుంటున్నాను. సలహా ఇవ్వండి.