close

తాజా వార్తలు

ఆరేళ్లలో ఆదాయపు పన్ను ఇలా..

ఇంటర్నెట్‌డెస్క్‌: అధికారం చేపట్టిన ఆరేళ్లలో నరేంద్ర మోదీ సర్కారు బడ్జెట్‌లో చాలా కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా ఎంతోమందిపై నేరుగా ప్రభావం చూపే ఆదాయపు పన్ను విభాగంలో సవరణలు చేసింది. మరోపక్క బడ్జెట్‌ తేదీని కూడా ఫిబ్రవరి 1కి మార్చింది. బ్రిటిష్‌ కాలం నుంచి వస్తున్న ‘బడ్జెట్‌ సూట్‌కేసు’ను మార్చి ఎర్రటి గుడ్డ సంచితో బడ్జెట్‌ పత్రాలను తీసుకొచ్చే సంప్రదాయం మొదలుపెట్టింది.  

* 2014లో మోదీ సర్కారు తొలిసారి అధికారం చేపట్టాక ఆర్థిక మంత్రిగా అరుణ్‌ జైట్లీ బాధ్యతలు స్వీకరించారు. ఈ బడ్జెట్‌లో ఆయన ఆదాయపు పన్ను మినహాయింపు పరిధిని రూ.2లక్షల నుంచి రూ.2.5లక్షల వరకు పెంచారు. సీనియర్‌ సిటిజన్లకు మినహాయింపును రూ.2.5లక్షల నుంచి రూ.3లక్షలకు చేర్చారు. ఇక 80ఏళ్లు దాటిన వారికి రూ.5లక్షలు చేశారు. సెక్షన్‌ 8సీ పరిధిని రూ.1లక్ష నుంచి రూ.1.5లక్షలకు పెంచగా.. గృహరుణాల వడ్డీపై పన్ను మినహాయింపును రూ.1.5లక్షల నుంచి రూ. 2లక్షలకు చేర్చారు. 

2015లో  జైట్లీ రెండో బడ్జెట్‌లో పన్ను స్లాబుల జోలికి వెళ్లలేదు. కేవలం ఆరోగ్య బీమాపై డిడక్షన్‌ను రూ.15 వేల నుంచి రూ.25వేలకు పెంచారు. ఇక సీనియర్‌ సిటిజన్లకు ఇది రూ.20 వేల నుంచి రూ.30వేలకు చేర్చారు. దీంతోపాటు ఎన్‌డీఏ ప్రభుత్వం ట్రాన్స్‌పోర్టు అలెవెన్స్‌పై మినహాయింపును కూడా రూ.800 నుంచి రూ.1,600కు చేర్చారు. రూ.1కోటికిపైగా ఆదాయం ఉన్న వారిపై సర్‌ఛార్జి 10శాతం నుంచి 12శాతానికి చేర్చారు. ఈ బడ్జెట్‌లో సంపద పన్ను తొలగించి 2శాతం సర్‌ఛార్జిని విధించారు. అత్యంత సంపన్నుల పన్ను ఆదాయం రూ.కోటి దాటితే దీనిని విధించేలా  నిబంధనలు పెట్టారు. 

* 2016  బడ్జెట్‌లో సెక్షన్‌87ఏ కింద పన్ను రిబేట్‌ను రూ.2,000 నుంచి రూ.5,000కు పెంచారు.  ఇది ఆదాయం రూ.5లక్షలు మించని వారికి మాత్రమే వర్తిస్తుందనే నిబంధన పెట్టారు. సెక్షన్‌ 80జీజీ కింద చెల్లించే ఆద్దెను రూ.24వేల నుంచి రూ.60 వేలకు పెంచారు. రూ. కోటి వార్షికాదాయం దాటిన వారిపై మరోసారి సర్‌ఛార్జిని 15శాతం నుంచి 12శాతానికి పెంచారు. దీంతోపాటు రూ.10లక్షలు దాటిన డివిడెండ్లపై 10శాతం ఆదాయపు పన్ను వేశారు. 

* 2017లో ఈ బడ్జెట్‌లో ఆదాయపున్న రూ. 2.5లక్షల నుంచి రూ.5లక్షల మధ్యలో ఉన్నవారికి పన్నును 10శాతం నుంచి 5శాతం చేశారు. దీంతో వారికి రూ.12,500 వరకు లబ్ధి చేకూరింది. సెక్షన్‌ 87ఏ కింద పన్ను రిబేట్‌ను కూడా 5,000 నుంచి రూ.2,500 చేశారు. వార్షికాదాయం రూ.3.5లక్షల వరకు ఉన్నవారికి ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. దీంతోపాటు వార్షికాదాయం రూ.50లక్షల నుంచి రూ.1కోటి మధ్య ఉన్నవారిపై 10శాతం సర్‌ఛార్జిని విధించడం మొదలుపెట్టారు. 

*2018లో మెడికల్‌ రీఎంబర్స్‌మెంట్‌, ట్రాన్స్‌పోర్టు అలవెన్స్‌ల స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిధిని రూ.40వేలకు పెంచారు. దీంతో సామాన్యూడికి రూ.5,800 వరకు ప్రయోజనం సమకూరింది. అదే సమయంలో సీనియర్‌ సిటిజన్లకు ఆరోగ్య ఖర్చుల మినహాయింపును రూ.30వేల నుంచి రూ.50వేలకు చేర్చారు. మరోపక్క బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పొదుపులపై వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపును రూ.10వేల నుంచి రూ.50వేలకు పెంచారు. మరోపక్క అప్పటికే ఆదాయపు పన్ను, కార్పొరేట్‌ పన్నుపై ఉన్న 3శాతం విద్యాసెస్సు స్థానంలో 4శాతం విద్య,ఆరోగ్య సెస్సును విధించారు. రూ.లక్ష విలువ దాటిన దీర్ఘకాలిక క్యాపిటల్‌ గెయిన్స్‌పై పన్ను విధించారు. 
* 2019లో పీయుష్‌ గోయల్‌ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎన్నికల సంవత్సరం కావడంతో మధ్యతరగతి వారిపై రూ.5లక్షల వరకు ఆదాయానికి పన్ను రిబేట్‌ ప్రకటించారు. దీంతోపాటు స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.40వేల నుంచి రూ.50వేలకు పెంచారు. ఆ తర్వాత మోదీ ప్రభుత్వం రెండో విడత బాధ్యతలు చేపట్టాక ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. దీనిలో ఆదాయపు పన్నుకు సంబంధించి ఎటువంటి ప్రకటనలు వెలువడలేదు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.