close

తాజా వార్తలు

44వేల మందికి ఆదాయపు పన్ను నోటీసులు

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వం గత బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-అసెస్‌మెంట్‌ పథకం కింద 44 వేల మందికి ఆదాయపుపన్ను నోటీసులు జారీ అయ్యాయి. పన్ను లెక్కల్లో పారదర్శకత తెచ్చేందుకు ప్రభుత్వం 2019 బడ్జెట్‌లో ఈ అసెస్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు నాటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీనిని గత అక్టోబర్‌లో ప్రారంభించారు. దీనిలో గుర్తించిన 58,322 కేసులకు గాను 44,285 కేసుల్లో నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులకు అధికారుల నుంచి వేధింపులు తప్పించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా పన్ను రిటర్నుల పరిశీలనల్లో వ్యక్తుల జోక్యాన్ని తగ్గించేందుకు , అవినీతిని నివారించేందుకు దీనిని ప్రవేశపెట్టారు. ‘‘ సాంకేతికతను ఉపయోగించుకొని మానవ జోక్యాన్ని తగ్గించి భారత్‌ను సరికొత్త శిఖరాలకు చేర్చాము’’ అని ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

ఈ-అసెస్‌మెంట్‌ ప్రయోజనాలు
* సెంట్రలైజ్‌డ్‌ ఈ అసెస్‌మెంట్‌ సెంటర్‌ నుంచి పన్ను చెల్లింపుదారులకు అందే నోటీసులకు డిజిటల్‌ విధానాలోనే సమాధానలు ఇవ్వాలి.
* పన్ను చెల్లింపుదారులను టెక్స్ట్‌ మెసేజీల రూపంలో కూడా అప్రమతం చేస్తారు. పన్ను చెల్లింపుదారులు తమ సమాధానాలను ఈమెయిల్‌ రూపంలో కూడా పంపించవచ్చు.
* వ్యక్తులు, అధికారుల జోక్యం గణనీయంగా తగ్గిపోతుంది. కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి తగ్గుతుంది.
* ఈ విధానంలో కేసులను దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 8 ఈ అసెస్‌మెంట్‌ సెంటర్లకు పంపిస్తారు. ఇది పూర్తిగా ఆటోమేటిక్‌ విధానంలో జరుగుతాయి. ఇది పారదర్శకత పెంచేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అధికమొత్తంలో అంచనాలు, పేచీలు తగ్గుతాయి.
* ఈ పథకం కింద జాతీయ ఈ అసెస్‌మెంట్‌ సెంటర్‌ ఆదాయపుపన్ను శాఖ కింద ప్రాంతీయ ఈ అసెస్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.