బోగస్ రిఫండ్ క్లెయిమ్స్ పై చర్యలు ప్రారంభించిన ఆదాయ పన్ను శాఖ - Income-tax-department-taking-action-against-bogus-refund-claims
close

Published : 25/12/2020 16:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బోగస్ రిఫండ్ క్లెయిమ్స్ పై చర్యలు ప్రారంభించిన ఆదాయ పన్ను శాఖ

బోగస్ పెట్టుబడులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సీబీడీటీ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. పన్ను చెల్లింపు ఫారమ్స్ లో చూపిన మోసపూరిత పెట్టుబడులకు సంబంధించిన బోగస్ రిఫండ్ క్లెయిమ్స్ ను నిరోధించడానికి ఆదాయ పన్ను శాఖ అదనపు తనిఖీలను ప్రవేశపెట్టిందని సెంట్రల్ బోర్డు అఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఛైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. ఇలాంటి పెట్టుబడులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సీబీడీటీ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రజలు బోగస్ రీఫండ్స్ ను క్లెయిమ్ చేసుకోవడం చాలా బాధాకరమైన విషయమని, ప్రజలు ఇటువంటి ఆలోచనలను మానుకుని, తమ పన్నులకు సంబంధించిన సరైన వాటాను నిజాయితీగా చెల్లించే సమయం ఇదేనని చంద్ర తెలిపారు. ముంబై, బెంగళూరుతో పాటు, పంజాబ్ లోని కొన్ని ప్రాంతాలలో జరిగిన సెర్చ్ ఆపరేషన్లలో, కొంతమంది మోసగాళ్లు పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించి, సెక్షన్ 80సీ కింద కల్పిత పెట్టుబడులు, గృహ రుణాలను ఆధారంగా చేసుకుని రీఫండ్స్ ను క్లెయిమ్ చేస్తున్నారని ఆదాయ పన్ను శాఖ తెలుసుకుంది. అలాగే కేవలం ఒక ఐపీ అడ్రస్ నుంచే చాలా రీఫండ్ క్లెయిమ్స్ ధాఖలైనట్లు కూడా ఆదాయ పన్ను శాఖ కనుగొనింది. ఒకవేళ ఏవైనా మోసపూరిత రిటర్న్ లు ధాఖలైనప్పుడు, సదరు రిఫండ్ ను నిలిపివేసేలా వ్యవస్థలో మార్పులు చేసినట్లు చంద్ర తెలిపారు.

“హై పిచ్డ్” అస్సెస్మెంట్ కు సంబంధించిన అంశాల గురించి చంద్ర ప్రస్తావిస్తూ, అటువంటి కేసులను పరిశీలించేందుకు సీబీడీటీ ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. అనేక మంది మా వద్దకు వచ్చి మా అస్సెస్మెంట్ చాలా “హై పిచ్డ్” అని చెప్పడం వలన మేము ముగ్గురు ప్రధాన కమిషనర్లతో ‘హై-పిచ్డ్’ అసెస్మెంట్ కమిటీని నియమించాము, ఒకవేళ మీ అస్సెస్మెంట్ “హై పిచ్డ్” అని మీరు భావించినట్లైతే, మీరు కమిటీని సంప్రదించవచ్చునని చంద్ర తెలిపారు.

ఒకవేళ అస్సెస్మెంట్ ను కమిటీ “హై పిచ్డ్” అని నిర్ణయించినట్లైతే, అస్సెస్మెంట్ అధికారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేలా డిమాండ్ చేయవచ్చు. గత ఏడాది, మేము “హై పిచ్డ్” అస్సెస్మెంట్లలో పాలుపంచుకున్న 12 కంటే ఎక్కువ మంది అస్సెస్మెంట్ అధికారులను బదిలీ చేశామని చంద్ర తెలిపారు.
 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని