పెరిగిన విదేశీ మారకపు నిల్వలు - Increased foreign exchange reserves
close

Published : 08/05/2021 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెరిగిన విదేశీ మారకపు నిల్వలు

ముంబయి: విదేశీ మారకపు నిల్వలు ఏప్రిల్‌ 30తో ముగిసిన వారానికి 3.913 బిలియన్‌ డాలర్లు పెరిగి 588.02 బిలియన్‌ డాలర్లకు చేరాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు పెరగడం ఇందుకు కారణం. అంతకుముందు వారం (ఏప్రిల్‌ 23తో ముగిసిన)లోనూ మారకపు నిల్వలు 1.701 బిలియన్‌ డాలర్లు పెరగడం గమనార్హం. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్‌ 30తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 4.413 బిలియన్‌ డాలర్లు అధికమై 546.059 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. పసిడి నిల్వలు 505 మిలియన్‌ డాలర్లు పెరిగి 35.464 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) వద్ద స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ 3 మిలియన్‌ డాలర్లు పెరిగి 1.508 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఐఎంఎఫ్‌ వద్ద దేశ నిల్వల స్థితి 2 మిలియన్‌ డాలర్లు పెరిగి 4.99 బిలియన్‌ డాలర్లకు చేరింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని