నియామకాల్లో పెరుగుతున్న మహిళల ప్రాతినిథ్యం - Increasing representation of women in appointments
close

Published : 19/02/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నియామకాల్లో పెరుగుతున్న మహిళల ప్రాతినిథ్యం

వీబాక్స్‌ నివేదిక

ముంబయి: సాంకేతికత నైపుణ్యానికి సంస్థలు ప్రాధాన్యం ఇస్తుండటంతో యువతకు ఉద్యోగాలు లభించడం తగ్గిందని ఓ సర్వే పేర్కొంది. అయితే డిజిటల్‌ విప్లవం కారణంగా మహిళలకు ఉద్యోగావకాశాలు పెరిగాయని పేర్కొంది. సీఐఐ, ఏఐసీటీఈ, ఏఐయూ, యూఎన్‌డీపీ భాగస్వామ్యంతో ‘ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌- 2021’ పేరిట వీబాక్స్‌ ఈ నివేదికను రూపొందించింది. యువతకు ఉద్యోగకల్పన 2020లో 46.2 శాతం ఉండగా.. 2021లో ఇది 45.9 శాతానికి తగ్గింది. మహిళలకు ఉద్యోగకల్పన 46.8 శాతానికి పెరిగింది. ఉద్యోగకల్పనలో లింగ వ్యత్యాసాలు బాగా తగ్గాయని సర్వే పేర్కొంది. గత ఐదేళ్లలో కంపెనీల్లో మహిళల ప్రాతినిథ్యం పెరిగిందని గుర్తించింది. మొత్తం సిబ్బందిలో మగవాళ్లు 64 శాతం మంది ఉంటే మహిళల సంఖ్య 36 శాతంగా ఉంటోందని వీబాక్స్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ నిర్మల్‌ సింగ్‌ తెలిపారు. బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల రంగంలో అత్యధికంగా మహిళలు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇంటి వద్ద నుంచి పనిచేసే అవకాశాన్ని కంపెనీలు కల్పిస్తుండటంతో మున్ముందు మహిళల ప్రాతినిథ్యం మరింతగా పెరుగుతుందని సర్వే అంచనా వేసింది. ప్రయాణ- పర్యాటక రంగాల నుంచి ఇంధనం, తయారీ రంగాల వరకు హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ నైపుణ్యం ఉన్న వారికి అధిక గిరాకీ ఉందని సర్వే గుర్తించింది. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా యువతకు ఉద్యోగకల్పన తగ్గిందని పేర్కొంది. దేశంలో ఉద్యోగాలకు తగ్గట్లుగా నైపుణ్యమున్న వాళ్లు మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటకలో ఎక్కువ మంది ఉన్నారని సర్వే పేర్కొంది. నగరాల విషయానికొస్తే ఈ విషయంలో హైదరాబాద్‌, బెంగళూరు, పుణె ముందు వరుసలో ఉన్నాయని తెలిపింది. బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, ఐటీ- ఐటీ ఆధారిత వ్యాపారాల్లో ఎక్కువగా నియామకాలు జరుగుతున్నాయని, ఆ తర్వాతి స్థానాల్లో ఆరోగ్య సంరక్షణ, వాహన, లాజిస్టిక్స్‌, రిటైల్‌ రంగాలు ఉన్నాయని పేర్కొంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని