సూచీల ఆధారిత బీమా పాలసీలు - Index-based insurance policies
close

Updated : 09/02/2021 04:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సూచీల ఆధారిత బీమా పాలసీలు

ఐఆర్‌డీఏఐ ప్యానెల్‌ సూచన

దిల్లీ: రాబడి హామీతో ఉన్న సంప్రదాయ బీమా పథకాలు, యూనిట్‌ ఆధారిత బీమా పాలసీ (యులిప్‌)లకు ప్రత్యామ్నాయంగా సూచీలకు అనుసంధానించిన బీమా పాలసీలు (ఐలిప్‌) తీసుకురావాలని ఐఆర్‌డీఏఐ ప్యానెల్‌ సూచించింది. గత ఏడాది ఆగస్టులో భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాథికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఇండెక్స్‌ ఆధారిత బీమా పాలసీలకు సంబంధించిన సూచనల కోసం ఒక వర్కింగ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుత అనిశ్చితి మార్కెట్లో వినియోగదారులు రాబడి హామీ ఉన్న పథకాలపై మక్కువ చూపిస్తున్నారని, వీటిని బీమా సంస్థలు అధికంగా విక్రయిస్తే.. వాటిపై ఒత్తిడి ఉండే అవకాశం ఉందని తెలిపింది. దీనికి బదులుగా ఐలిప్‌లు ప్రస్తుత తరుణంలో సరైన ప్రత్యామ్నాయమని సూచించింది. యాన్యుటీ పాలసీల్లో పెట్టుబడి వెనక్కి ఇచ్చే ఐచ్ఛికంలో వడ్డీ రేట్లను, ఇండెక్స్‌ను పరిగణించి మార్పులు చేసేందుకు వీలుండాలని పేర్కొంది. ప్రామాణిక సూచీగా దేన్ని పరిగణనలోనికి తీసుకుంటారన్న దానిపై పాలసీదారులకు స్పష్టమైన వివరణ ఉండాలని తెలిపింది. ఐలిప్‌ల వల్ల పాలసీదారులకు ప్రత్యామ్నాయ పెట్టుబడికి అవకాశం లభిస్తుందని, అదే సమయంలో ఇది బీమా సంస్థలపై ఆర్థిక ఒత్తిడి తగ్గిస్తుందని ప్యానెల్‌ అభిప్రాయపడింది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని