ఇండిగో నుంచి ‘ఇంటింటికీ లగేజ్‌’ సేవలు - IndiGo launches door-to-door baggage transfer service in Delhi Hyderabad
close

Published : 02/04/2021 16:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇండిగో నుంచి ‘ఇంటింటికీ లగేజ్‌’ సేవలు

దిల్లీ: దేశీయ ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికుల సౌకర్యం కోసం మరో సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇంటి నుంచి ఎయిర్‌పోర్టుకు లేదా విమానాశ్రయం నుంచి ఇంటికి ప్రయాణికులు తమ బ్యాగులు మోసుకెళ్లే బాధ లేకుండా ‘డోర్‌ టు డోర్‌ బ్యాగేజ్‌ ట్రాన్స్‌ఫర్‌’ సర్వీసులను ప్రారంభించింది. ప్రస్తుతం దిల్లీ, హైదరాబాద్‌లలో ఈ సేవలను మొదలుపెట్టగా.. త్వరలోనే ముంబయి, బెంగళూరులోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎయిర్‌లైన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

ప్రముఖ ఆన్‌లైన్‌ లాజిస్టిక్‌ సేవల సంస్థ కార్టర్‌పోర్టర్‌ భాగస్వామ్యంతో ‘6EBagport’ పేరుతో ఇండిగో ఈ సేవలను ప్రారంభించింది. 6EBagportతో ప్రయాణికుల నుంచి బ్యాగేజీలు తీసుకుని భద్రంగా వారికి గమ్యస్థానానికి చేరుస్తామని ఎయిర్‌లైన్‌ తెలిపింది. ఇందులో ట్రాకింగ్‌ సదుపాయం కూడా ఉంది. దీంతో కస్టమర్లు తమ లగేజీ ఎక్కడిదాకా వచ్చిందో తెలుసుకోవచ్చు. విమానం బయల్దేరడానికి 24 గంటల ముందు వరకు, విమానం దిగిన తర్వాత ఎప్పుడైనా ఈ సేవలను వినియోగించుకోవచ్చని ఇండిగో తెలిపింది. 

ప్రయాణికులు తమ ఇంటి నుంచి ఎయిర్‌పోర్టు వరకు లేదా విమానాశ్రయం నుంచి ఇంటికి లగేజీని పంపించుకోవచ్చు. రూ. 630(ఒక ట్రాన్స్‌ఫర్‌కు) ప్రారంభ ధరతో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని సంస్థ వెల్లడించింది. అంతేగాక, బ్యాగేజీకి రూ. 5000 చొప్పున సర్వీసు ఇన్స్యూరెన్స్‌ కూడా ఇస్తున్నట్లు తెలిపింది. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని