ఏప్రిల్‌-జూన్‌లో ఉద్యోగావకాశాలు పెరుగుతాయ్‌ - India anticipates rise in employment in Apr Jun qtr Survey
close

Updated : 10/03/2021 13:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏప్రిల్‌-జూన్‌లో ఉద్యోగావకాశాలు పెరుగుతాయ్‌

మ్యాన్‌పవర్‌ గ్రూపు సర్వేలో వెల్లడి

దిల్లీ: రానున్న మూడు నెలల్లో (ఏప్రిల్‌- జూన్‌) నియామకాలు పుంజుకోవచ్చని మ్యాన్‌పవర్‌ ఇండియా సర్వేలో వెల్లడైంది. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, విద్య, సేవా రంగాల్లో అధికంగా ఉద్యోగావకాశాలు ఉంటాయని తెలిపింది. జూన్‌ త్రైమాసికంలో నికర ఉద్యోగకల్పన 9 శాతం మేర ఉండొచ్చు.‘బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉద్యోగాల సృష్టికి అవకాశం కల్పిస్తున్నాయి. మౌలిక, ఆరోగ్య సంరక్షణ, బీఎఫ్‌ఎస్‌ఐ రంగాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంద’ని మ్యాన్‌పవర్‌ గ్రూపు ఇండియా ఎండీ సందీప్‌ గులేటి తెలిపారు. ఉద్యోగకల్పన కోసం ప్రభుత్వం వెచ్చించిన నిధుల ప్రభావం సెప్టెంబరు, డిసెంబరు త్రైమాసికాల్లో కనిపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. టోకు, రిటైల్‌ వ్యాపార రంగాల్లో నియామకాలు పరిమితంగానే ఉండొచ్చని సర్వే పేర్కొంది. నియామకాలపరంగా 2021 జూన్‌ కల్లా కొవిడ్‌-19 ముందు స్థాయికి చేరుతామని 27 శాతం కంపెనీలు వెల్లడించగా.. 2021 చివరినాటికి ఆ స్థాయిని అందుకుంటామని 56 శాతం సంస్థలు తెలిపాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని